
ప్రకృతే ఆమె
ఉక్కపోతలో ఊరట
తడి ఆరిన చూపులకు
కురిసే చల్లని మేఘం
సముద్రమే ఆమె
లోతు చెప్పని కెరటాలతో
నిత్యం సవ్వడే
ఆమె పరిచయం ఒడ్డుపై
కవిత్వమైన ఆమే
ఏ ఊహ ఐనా సరే
మనసుకు హత్తుకుని
మెత్తగా మ్రోగే అక్షరం ఆమె
– చందలూరి నారాయణరావు

ప్రకృతే ఆమె
ఉక్కపోతలో ఊరట
తడి ఆరిన చూపులకు
కురిసే చల్లని మేఘం
సముద్రమే ఆమె
లోతు చెప్పని కెరటాలతో
నిత్యం సవ్వడే
ఆమె పరిచయం ఒడ్డుపై
కవిత్వమైన ఆమే
ఏ ఊహ ఐనా సరే
మనసుకు హత్తుకుని
మెత్తగా మ్రోగే అక్షరం ఆమె
– చందలూరి నారాయణరావు