
ఐపీఎల్ 19లో భాగంగా ఏప్రిల్ 5న సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో లక్నో ఘన విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరింతంగా సాగిన ఈ మ్యాచులో చివరి ఓవర్లో లక్నోకు విజయాన్ని అందించాడు ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్. అయితే, ఈ మ్యాచులో లక్నో ప్లేయర్ అవేష్ ఖాన్ విన్నింగ్ సెలబ్రేషన్స్ వివాదస్పదంగా మారాయి. అవేష్ ఖాన్ తీరుపై సన్ రైజర్స్ అప్పీల్ చేసినా.. అంపైర్లు సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.
అసలేం జరిగిందంటే..?
లక్నో విజయానికి చివరి రెండు బంతుల్లో ఒక రన్ అవసరం. ఈ దశలో జయదేవ్ ఉనద్కత్ వేసిన చివరి ఓవర్ ఐదో బంతి (19.5)ని పంత్ షాట్ ఆడాడు. బంతి ఫీల్డర్లను దాటుకుని బౌండరీ వైపు వెళ్లింది. అప్పటికే బౌండరీ లైన్ అవతల ప్యాడ్లు కట్టుకుని నిల్చున్న లక్నో ప్లేయర్ అవేశ్ ఖాన్ బాల్ బౌండ్రీ లైన్ క్రాస్ చేయకముందే బ్యాట్‌తో మళ్లీ బాల్ ను గ్రౌండ్లోకి కొట్టి విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. క్రికెట్ నియమాల ప్రకారం అవేష్ ఖాన్ చేసిన పని నేరం.
ఎంసీసీ చట్టం 20.4.2 ప్రకారం మైదానం బయట ఉన్న ఎవరైనా వ్యక్తి ఆటలో జోక్యం చేసుకుంటే ఆ డెలివరీని డెడ్ బాల్‌గా ప్రకటించవచ్చు. అలాగే, బ్యాటింగ్ జట్టులోని సభ్యుడు బంతిని అడ్డుకున్న కూడా ఆ డెలివరీని డెడ్ బాల్‌గా పరిగణిస్తారు. సన్ రైజర్స్ దీనిపై అప్పీల్ చేస్తే 5 పెనాల్టీ రన్స్ వచ్చేవి. కానీ ఎస్ఆర్హెచ్ అప్పీల్ చేయలేదు. అంపైర్లు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో అవేష్ ఖాన్ బతికిపోయాడు.
ఒకవేళ ఎస్ఆర్హెచ్ అప్పీల్ చేసినా, అంపైర్లు గమనించినా ఆ బాల్‌ను డెడ్ బాల్‌గా పరిగణించడంతో పాటు ఎస్ఆర్హెచ్ కు 5 పెనాల్టీ రన్స్ వచ్చేవి. అప్పుడు మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఈ ఘటనపై ఇరు జట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు.
దీనిపై సన్ రైజర్స్ అప్పీల్ చేసి ఉండాల్సిందని.. గెలిచే మ్యాచును చేజేతులా పొగొట్టుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. లక్నో ఫ్యాన్స్ మాత్రం అవేశ్ ఖాన్‌ను సెటైరికల్‌గా విమర్శిస్తున్నారు. అవేష్ బ్రో.. ఎందుకింత ఆవేశం.. నీ ఓవరాక్షన్ వల్ల కొంచమైతే మ్యాచే చేజారిపోయేదని సెటైర్లు వేస్తున్నారు. మరీ ఐపీఎల్ నిర్వాహకులు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలీ.
Why Avesh Khan Is So Annoying First he smashed his helmet, then hit the ball with his bat even though it hadn’t reached the boundary the umpire should ban him for one match Or Umpire Should Do That Delivery Dead Ball 😡
pic.twitter.com/3xl2WxJlgh— ValenceCricket (@CricketValence) April 5, 2026