Reading Time: < 1 minute

మోదీజీ.. అమెరికాతో మాట్లాడి యుద్ధం ఆపండి.. గ్యాస్ కొరత వల్ల పండ్లు తినాల్సి వస్తుంది: సీపీఐ నారాయణ

Caption of Image.

దేశంలో గ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సామాన్యుడు పడుతున్న  కష్టాలపై  ప్రధాని మోదీ తీరును ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

ప్రధాని మోదీ దేశంలో గ్యాస్ కొరత లేదని చెబుతున్నారు.. కానీ క్షేత్రస్థాయిలో  గ్యాస్ సిలిండర్లు దొరక్క, ధరలు భరించలేక ప్రజలు వంట వండుకోలేక కేవలం పండ్లు మాత్రమే తిని కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. అంతేకాదు  ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో మోదీ అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.

యుద్ధం చేస్తున్న అమెరికాతో మాట్లాడి శాంతిని నెలకొల్పాల్సింది పోయి.. మనకు చమురు సరఫరా చేసే ఇరాన్‌ను దెబ్బలు తినమని మోదీ చెబుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు నారాయణ.  యుద్ధం ఆగి  ధరలు తగ్గాలంటే మోదీ నేరుగా అమెరికాతోనే మాట్లాడాలన్నారు.గ్యాస్ కష్టాలు తీరాలన్నా  అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ముగియాలన్నా కేంద్రం తన వైఖరి మార్చుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.

భారత్‌కు అవసరమైన వంట గ్యాస్  ఎల్పీజీలో దాదాపు 90 శాతం దిగుమతుల నుంచే వస్తుంది. అందులోనూ మెజారిటీ వాటా పర్షియన్ గల్ఫ్ దేశాలదే. ఇరాన్, ఒమన్ మధ్య ఉండే  హర్మూజ్ జలసంధి ద్వారానే ప్రపంచంలోని 20% చమురు, గ్యాస్ రవాణా అవుతుంది. యుద్ధం కారణంగా మార్చి 1 నుంచి ఈ మార్గం మూతపడటంతో భారత్‌కు వచ్చే గ్యాస్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీనివల్ల భారత్‌లో కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. చాలా చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లు,హాస్టళ్లు మూతపడ్డాయి. గ్యాస్ కొరత వల్ల వంటలు వండటం మానేశారు. 

 

©️ VIL Media Pvt Ltd.