
ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం,
గుండాల భౌగోళికంగా భద్రాచలంతో కలిసి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లో
విలీనం తర్వాత అక్కడి ప్రజలు పాలనాపరంగా అవస్థలు పడుతున్నారు
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే సమస్యను పరిష్కరించండి కేంద్ర
హోంమంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: భద్రాచలం ప ట్టణానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు రాష్ట్ర వ్వయసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ దివారం లేఖ రాశారు. భద్రాచలం పట్టణానికి అనుకుని ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండా ల పంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ రా ష్ట్రంతో కలిసి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని వివరించారు. భద్రాచలం ప ట్టణం తెలంగాణలోనే ఉన్నా, భద్రాచలం గ్రా మం, పట్టణం మినహా భద్రాచలం మండలంలోని మిగిలిన అన్ని రెవెన్యూ గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసినట్లు గుర్తు చేశారు. సుమారు 19 రెవెన్యూ గ్రామాలను కలిగి ఉన్న ఈ గ్రామ పంచాయతీలు, తెలంగాణ భూభాగంలోని రెండు ప్రాంతాల మధ్య ఒక విలక్షణమైన భౌగోళిక ప్రదేశంలో నెలకొని ఉన్నాయని, వీటి మిగిలిన సరిహద్దులు గోదావరి నది, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాన్ని కలిగి ఉన్నట్లు వివరించారు.
దీంతో స్థానిక ప్రజలకు అనవసరమయిన కష్టాలను కలిగిస్తుందని చెప్పారు. ఈ గ్రామ పంచాయతీలు నివాస ప్రాంతాలు రాకపోకలు, పరిపాలన, జీవనోపాధి, ప్రజా సేవల కోసం పూర్తిగా భద్రాచలంపైనే ఆధారపడి ఉన్నాయని, ఈ క్రమంలో వీటిని ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగించడం స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని పేర్కొన్నారు. గతంలో భద్రాచలం పట్టణంతో తమకున్న చారిత్రక అనుబంధం, ప్రధానంగా షెడ్యూల్ తెగలకు చెందిన గ్రామ పంచాయతీలలోని ప్రజలు తెలంగాణలో భాగం కావాలని కోరుతూ స్థానిక నివాసితులు పలుమార్లు శాంతియుత ధర్నాలు, ప్రదర్శనలు కూడా నిర్వహించిన విషయాన్ని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. ప్రభావిత గ్రామస్థులు ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా స్థాయి పరిపాలన, పనుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం సుమారు 282 కిలోమీటర్ల (రోడ్డు మార్గంలో సుమారు 8 గంటల ప్రయాణం) దూరంలో ఉండగా, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కేవలం 40 కిలోమీటర్ల (రోడ్డు మార్గంలో సుమారు గంట ప్రయాణం) దూరంలో ఉందని వివరించారు.
ప్రస్తుత పరిస్థితులతో వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులను రవాణా చేసేటప్పుడు స్థానిక గిరిజన జనాభాకు పదేపదే తనిఖీలు, రాకపోకలకు సంబంధించిన ఇబ్బందులతో సహా, అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు సమీపంలో ఉండటం, చారిత్రాత్మకంగా వామపక్ష తీవ్రవాదం ప్రభావానికి లోనవడం వల్ల ఈ ప్రాంతం అంతర్గత భద్రత దృష్ట్యా సున్నితమైనదని, దీంతో పోలీసులులకు భద్రతాపరమయిన సవాళ్లను సృష్టిస్తాయని పేర్కొన్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, భద్రాచలం, తెలంగాణలో ఉండగా ఆలయానికి సంబంధించిన భూములు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని పురుషోత్తపట్నంలో ఉన్నాయని, ఆలయ వ్యవహారాలు, అనుబంధ భూముల పరిపాలన కోసం, ఈ ప్రాంతాన్ని తెలంగాణలో తిరిగి విలీనం చేయడం తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని లేకపోతే రాబోయే సంవత్సరాలలో ప్రభావిత గ్రామాలు, గిరిజన నివాసాలకు దీర్ఘకాలిక అన్యాయం జరుగుతుందని మంత్రి తెలిపారు.