Reading Time: 2 minutes
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ప్రతీ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు.. మీరూ పొందటం ఎలా..?

ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఇటీవల కేంద్రం మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంతో హోటల్స్, రెస్టారెంట్ల నిర్వహకులకు షాక్ తగిలినట్లయంది. ఇక గత నెలలో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం వల్ల ఇంట్లో వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. అయితే గ్యాస్ ధరలు పెరుగుతున్న క్రమంలో మీరు సిలిండర్‌పై రూ.300 ఇన్‌స్టంట్ తగ్గింపు పొందవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకం అమలు చేస్తోంది. ఆ స్కీమ్ పేరే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన. ఈ పథకం కూడా మీరు లబ్దిదారులుగా ఉంటే సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.300 సబ్సిడీ పొందవచ్చు. అదెలా అంటే..?

ప్రతీ ఏటా 12 సిలిండర్లపై రాయితీ

ఈ స్కీమ్‌ను 2016 మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశంలోని పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌తో పాటు సిలిండర్ల రీఫిల్లింగ్‌పై రూ.300 సబ్సిడీ ఇస్తున్నారు. ప్రతీ ఏటా 12 సిలిండర్లపై సబ్సిడీ ఉంటుంది. గ్రామీణ, నిరుపేద కుటుంబాలకు ఎల్పీజీ వంటి స్వచ్చమైన వంట ఇంధనాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ఫథకం తీసుకొచ్చారు. ఇప్పటివరకు 10 కోట్లకుపైగా ప్రజలు ఈ స్కీమ్ ద్వారా లబ్ది పొందారు. గ్రామీణ మహిళలు, పేదలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఇక మహిళల జీవితాలను సులభతరం చేసింది.

ఆర్ధిక రంగాలపై ప్రభావం

ఇక ఈ పథకం సామాజిక, ఆర్ధిక రంగాలపై కూడా ప్రభావం చూపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ వినియోగం వల్ల గ్యాస్ పంపిణీ కేంద్రాలు, డెలివరీ సేవలు పెరిగాయి. దీని వల్ల వల్ల కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. ఇక మహిళల సమాజిక హోదా మెరుగుపడటంతో పాటు ఇప్పుడు మరింత స్వతంత్రంగా భావిస్తున్నారు. కుటుంబ నిర్ణయాల్లో కూడా మహిళల భాగస్వామ్యం పెరిగింది.

అర్హతలు ఏంటి..?

-దరఖాస్తుదారుడు 18 సంవత్సరాలు నిండిన మహిళ అయి ఉండాలి

-ఇప్పటివరకు ఎల్పీజీ కనెక్షన్ కలిగి ఉండకూడదు

-నిర్దేశిత ఫార్మట్ ప్రకారం సెల్ప్ డిక్లరేషన్ సమర్పించాలి

డాక్యుమెంట్స్ ఇవే..

-కేవైసీ దరఖాస్తు ఫారం

-ఆధార్ కాపీ

-అడ్రస్ ప్రూఫ్

-రేషన్ కార్డు

-బ్యాంక్ పాస్ బుక్ కాపీ

దరఖాస్తు విధానం ఎలా..?

https://www.pmuy.gov.in/ujjwala2.html వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి. అందులోకి వెళ్లి ఏ గ్యాస్ ఏజెన్సీ నుంచి పొందాలనుకుంటున్నారనేది సెలక్ట్ చేసుకుని ప్రక్రియ పూర్తి చేయాలి. ఇక గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.