Reading Time: 4 minutes

సాహిత్య వాసనలేని మధ్యతరగతి ఇంట్లో పుట్టాను . అమ్మ పుట్టిల్లు హైదరాబాద్, నీలోఫర్ ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. బాల్యం, యవ్వనం విజయవాడలో నే గడిచాయి. చాలామంది కవుల్లా గా ఊరి చెరువు, ఈతలు, రావి చెట్టు ఉయ్యాల లు, అభిరుచి కలిగించే పంతుళ్ళు లాంటి మానసిక స్వాంతనలేవీ నాకు లేవు. విజయవాడ ఇరు కు గల్లీలో మూడు వాటాల పెంకుటింటి చివరి వాటా ఇల్లు, రోడ్డుకి అడ్డంగా పరిగెడుతూ పందు లు, ఇంటిముందు మురిక్కాలవలు, ఆడుకుంటూ అప్పుడప్పుడు అందులో పడిలేవడంతో నా బా ల్యం గడిచింది. ఇంట్లో అమ్మ మీద పెత్తనం చేసే బామ్మా, పిల్లలమైన మా మీద పెత్తనం చేసే బా బాయిలు, వాళ్ళకి ఎదురుతిరిగి, దెబ్బలు తినడం ఇవి కూడా నా స్వభావాన్ని తీర్చిదిద్దాయి.

మా నాన్నకి తాత వరసయ్యే కొండేపూడి లక్ష్మి నారాయణ అనే గేయ కవి, కమ్యూనిస్ట్ ఉద్య మం నడిపారని, పెద్దమనుషులు అనే సినిమా తీశారని, వీధి నాటకాలు వేసే రాధ అనే వేరే కు లం అమ్మాయిని వివాహం చేసుకున్నారని గుసగుసలు ఉండేవి. మా మేనత్తల చదువు స్కూలుతోనే ఆగిపోయింది. నా తరంలో కాలేజీ మెట్టు ఎక్కిన మొదటి ఆడపిల్లని నేనే. అంచేత అతి జాగ్రత్త కొద్దీ, దగ్గరగా ఉన్న కో ఎడ్యుకేషన్‌లో కాకుండా ఎక్కువ ఫీజు కట్టి మరీ ఉమెన్స్ కాలేజీలో చేర్చారు. మారి స్టెల్లా కాలేజీ కొలనులో కలువ పూలు బావుండేవి కానీ, ఆ విపరీత క్రైస్తవ క్రమశిక్షణ నాకు నచ్చేది కాదు.

డిగ్రీ మొదటి ఏ డాదికే ఆకాశవాణిలో చిరుద్యోగం రెక్కల్ని ఇచ్చిం ది. ఎకనమిక్స్ టెస్టుల్లో కూడా తిలక్‌ని, శేషేంద్రనీ గుమ్మరించే నేను, సరళ వాక్యం నేర్చుకుంది అక్క డే. యువవాణిలో కాజువల్ కాంపీరర్‌గా ఉన్నరోజుల్లో ఒకసారి రావాల్సిన వక్త రికార్డింగుకి రాలే దు. సాయంత్రానికల్లా ప్రోగ్రామ్ లైవ్‌కి వెళ్ళాలి. కథ ఏదయినా ఉంటే చదివేసి మంగళ వాక్యం పాడవచ్చు కానీ, చేతిలో ఏదీ లేదు. భయపడ్డాను. ఏం చేయాలో తోచక అప్పటికప్పుడు రికార్డింగు రూములో కూచుని కథ రాసేశాను. దానిపేరు పే రు మువ్వ మూగబోయింది. జనం తప్పకుండా తిడతారని, ఉద్యోగం ఊడిపోతుంది అని అనుకున్నాను. చిత్రంగా దానికి భలే పేరొచ్చింది. రేడి యో పత్రిక వాణిలో కూడా అచ్చయింది.

నా మొదటి కవిత పేరు దుర్లోచన. దానికి కా రణం కోపం. మా హెడ్ ఆఫ్ ది తెలుగు డిపార్ట్ మెంట్ లాలితాదేవి. జయశ్రీ పత్రికలో వచ్చింది. అచ్చానందం భలే ఉంటుంది. సవ్యసాచి అనే పేరుతో కొన్నాళ్ళు కవిత్వం రాశాను. భారతి పత్రికలో ఇంకో సవ్యసాచి ఎవరో ఉండటం వల్ల, తిరిగి నా పేరుకి మారిపోయాను. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది నాలో ఉన్న ఇంకో కో ణం. అది ఒక్క నేనే ఇన్ని ముక్కలు కవిత రాయించింది. 1988లో ఇల్లు ఖాళీ చేసినప్పుడు.. అనే కవిత రాశాను. మొన్నీ మధ్య మళ్ళీ అదే వస్తువు మీద వ్యాసం రాశాను రెంటి మధ్యా ఎంత వైరుధ్యం ఉందో చెప్పడం నా ఉద్దేశ్యం. అస్తిత్వ వాద ఉద్యమ కవులకి కవితా వస్తువు ఊహాలలోంచి కా దు సందర్భంలో నుంచే పుడుతుందని నా ఉద్దేశ్యం. స్త్రీలు ముట్టకూడని వస్తువులు, ప్రతీకలు ఎన్నో ఉ న్నాయని తెలిసాక పనికట్టుకుని అవే రాశాను. మదర్ సీరియస్, హృదయానికి బహువచనం- లాంటి కవితా శిల్పాల గురించి చేరాతలు చెప్పా యి. సంప్రదాయ వ్యతిరేక ధోరణిగా ముద్రపడి విమర్శలకి గురవుతున్న సమయంలో, స్త్రీవాదానికి చేరా మాస్టారు ఇచ్చిన మోరల్ సపోర్టు చాలా ఉండేది. అప్పటికి ఒకే ఒక్క కవిత రాసిన కవయిత్రి గురించి కూడా చేరాతల్లో వచ్చిన ప్రశంసలు చూసి సీనియర్ కవులు అసూయపడేవారు.

ప్రముఖ కవయిత్రి విమల, నేను రాస్తున్న కవి త్వం మీద ఎబికె ప్రసాద్ నీలాల రేవు నిర్మల, పా తాళ గంగ విమల అనే పేరుతో వార్తలో ఒక సం పాదకీయం రాశారు. నేను రాసిన పుస్తకాలలో నడిచే గాయాలుకి వచ్చిన గుర్తింపు కాలానికి, అప్పటి సామాజిక సందర్భానికి వదిలేస్తే నాకు మాత్రం బాధా శప్తనది అంటేనే ఇష్టం. సంధిగ్ధ సంధ్య, నడిచే గాయాలు, బాధా సప్తనది మూడు పుస్తకాల రోజుల్లోనూ నేను తెలంగాణా మారు మూల గ్రామాల్లో ఉండేదాన్ని, కవిత్వమే నన్ను సభల పేరిట మనుషుల దగ్గరికి తీసుకొచ్చే వాహికగా ఉండేది. సాహితీ వాతావరణం లేనిచోట సాహితీ మిత్రుల లేఖలే గొప్ప ఊరటగా కూడా ఉండేవి. నడిచే గాయాలులో వచ్చిన కవిత్వం పరిశీలిస్తే ఒక బాలిక పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకూ ఉన్న దశలన్నీ రికార్డ్ చేయగలిగాను. బాధా శప్తనది నుంచి రాజకీయ స్పృహ బాగా కనిపిస్తుంది.

నాలుగో సంపుటి మల్టీ నేషనల్ ముద్దులో ప్రపంచీకరణ ప్రభావం మానవ జీవితంలోని అన్నీ కోణాల్లో ఎలా ఉం టుందో చెప్పడానికి ప్రయత్నించాను. నివురు కవి తా సంపుటి వచ్చేలోగా నేను అమెరికా వెళ్ళి వ చ్చాను, కాబట్టి అక్కడ ఉన్న తెల్లతోలు రాజకీ యం, భారతీయుల సమస్యలు లాంటివి నా ఊ హకి అందినవి రాశాను. తిరిగి అన్నీ కలిపి నిర్మల కవిత్వంగా ఒక సంపుటి వేశాను. ఇప్పుడు వద్దనుకున్నకొద్దీ ఫాసిజమే రచనకి సంభాషణకి వస్తువు అవుతోంది. ఈ మధ్య వచనం ఎక్కువ రాస్తున్నాను. అది ఉద్దేశపూర్వకంగానే జరిగింది. నేను చెబుతున్న విషయానికి ప్రక్రియాపరమైన అడ్డంకులు ఉండకూడడదనేది, సులువుగా అందరికీ అందాలనేది నా అభిమతం.

శత్రుస్పర్శ, ఎచ్చటికిపోతా వీ రాత్రి రెండు కథా సంకలనాలు వేశాను. మృదంగం వ్యాసాల పుస్తకం వచ్చింది. ఇప్పు డు మళ్ళీ వేయాల్సినవి చా లా ఉన్నాయి. ము ఖ్యంగా కవిత్వం అనువాదాలు 50 వరకు ఉన్నాయి. ఫేస్‌బుక్ లో పోస్టు చేసిన వ్యాసాలు 45వరకు ఉన్నాయి. విలపి త భారత్ పేరుతో వేద్దామని ఉంది. చూడాలి. నా వ్యాసాలకి రంగవల్లి స్మారక అవార్డు, లాడ్లీ మీడియా అ వార్డు వచ్చాయి. కవిత్వానికయితే కేరళ ప్రభుత్వం ఇచ్చిన జాతీయ బహుమతితో పాటు దాదాపు ఇరవై వరకు గుర్తింపులున్నాయి. నేను రాసిన శారీఘర్ అనే కథ గురజాడ నుంచి ఇప్పటి వరకు వచ్చిన వంద మంచి కథల్లో ఒకటిగా ఎంపికవడం చెప్పుకోదగిన విషయం.

ఇక నా ఉద్యోగ జీవితానికి వస్తే ఆంధ్రజ్యోతిలో 1978 నుంచీ నా జర్నలిజం జీవితం మొదలయింది. ఉదయం సుప్రభాతం, ఆంధ్రపభ, ఆకాశవాణి, మాభూమి, వర్తమానం లాంటి పత్రికలన్నీ అయిపోయాక, జర్నలిజంలో చాలా మార్పులు వచ్చాయి. ఏషియా నెట్ చానల్ వారి అంతర్జాలంలో పనిచేశాను. అనుకోకుండా ప్రభు త్వ రంగంలోకి వచ్చి పడ్డాను. అది కూడా చాలా నాటకీయంగా జరిగింది. నేను వలసల రాజ్యం అనే కవిత రాసేనాటికి ఆంధ్రప్రదేశ్ అకాడమీ వాళ్ళు జండర్ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ కోసం చూస్తున్నారు. నా గురించి తెలుసుకుని వాకబు చే శారు. వెళ్ళాను. అవకాశం వచ్చింది, దాని తర్వా త రూరల్ వెలుగు, అర్బన్ వెలుగు, యునిసెఫ్, ప్రియాలాంటి ఎన్జీవోల్లో కూడా ట్రయినర్‌గా చేశాను.

జర్నలిస్ట్‌గా నేను ప్రజల మధ్య నుంచుని చూసిన సమస్యలని, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య నుంచుని దాని అమలులో ఉండే రాజకీయాల్ని తెలుసుకున్నాను. ఈ రెండిటికి మధ్యలో కొన్నాళ్ళు సీరియ ల్స్‌లో చెప్పడానికి డబ్బింగ్ నేర్చుకున్నాను. ఉద్యోగానికి, ఉద్యోగానికి మధ్య చిన్నచితకా ప్రాజెక్టు లు కొన్ని చేశాను. అందులో ఒకటి జూనియర్ ఆర్టిస్టుల జీవితాల గురించి చేసినది చెప్పుకోవాలి. శ్మశానాల్ని ఆశ్రయించుకుని బతికే బేగరివాళ్ళ ని ఇంటర్వ్యూ చేశాను. జెఎన్టీయూ ఆర్ట్ కాలేజీ లో న్యూడ్ మోడలింగ్ చేసే బిక్కి అనే అమ్మాయి కష్టాల్ని రికార్డు చేశాను. అదీ కవిత్వమయిపోయింది. మెహందీవాడలో ఉండే అమ్మాయిలతో మాట్లాడినప్పుడు నాన్నల్ని కొనాలి కిలో ఎంత కవిత రాశాను. ఏ నిజాయితీ, స్పష్టతలు కవులకి, కళాకారులకి ఉండి తీరాలో అవే ఇప్పుడు నిషిద్ధ మార్గాలవడం ఇప్పటి విషాద వాస్తవికత. దుష్ట రాజకీయాలు మనిషి జీవితంలో పుట్టిస్తున్న ప్రకంపనలు మౌనంగా ఉంచలేకపోతున్నాయి. కానీ అవి రికార్డు చేయడమే ఇప్పటి మన సవాలు.

– కొండపూడి నిర్మల