Reading Time: < 1 minute

కొత్తగూడెం స్టేడియాన్ని ..గ్రాస్ కోర్టుకు మార్చేందుకు కృషి : జీఎం వెల్ఫేర్ కిరణ్ కుమార్ 

Caption of Image.

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియాన్ని గ్రాస్ కోర్టుగా మార్చేందుకు కృషి చేస్తామని సింగరేణి సంస్థ జీఎం వెల్ఫేర్​ కిరణ్ కుమార్​ పేర్కొన్నారు. స్టేడియంలో కొత్తగూడెం ఛాంపియన్​ షిప్​ సిజన్​_2 పేరుతో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ క్రీడలకు సింగరేణి పెద్దపీట వేస్తోందన్నారు.

సింగరేణి క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయిలో పలు విభాగాల్లో పలు పతకాలు తీసుకువచ్చి కంపెనీకి పేరు తేవడం అభినందనీయమన్నారు. ఈ ప్రోగ్రాంలో కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​ మేయర్ మూడ్ గణేశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్​కె.సాబీర్​ పాషా, ట్రోఫి నిర్వాహకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.  

 

©️ VIL Media Pvt Ltd.