Reading Time: < 1 minute
Karishma Tanna Pregnant At 42 Baby Bump Photos Go Viral

Karishma Tanna: బాలీవుడ్ ప్రముఖ నటి కరిష్మా తన్నా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. 42 ఏళ్ల వయసులో ఆమె తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమె త్వరలో తన తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో, ఆమె పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

Read Also: IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

కరిష్మా తన భర్త వరుణ్ బంగేరాతో కలిసి దిగిన పలు ఫొటోలను షేర్ చేస్తూ తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. ఆ ఫొటోలలో ఈ జంట ఎంతో సంతోషంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఒక ఫొటోలో కరిష్మా తన భర్త ఒడిలో కూర్చుని ఉండగా, ఇద్దరూ నల్లటి టోపీలు ధరించి కనిపించారు. కరిష్మా టోపీపై “MOM”, వరుణ్ టోపీపై “DAD” అని ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంకొక ఫొటోలో ఈ జంట చిన్నారి బూట్లు పట్టుకుని కనిపించగా, మరికొన్ని చిత్రాల్లో కరిష్మా తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ కనిపించింది. ఈ ఫొటోలు వారి మధ్య ఉన్న ప్రేమ, అనుబంధాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. అభిమానులు ఈ జంటను ‘పవర్ కపుల్’గా అభివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కరిష్మా తన పోస్ట్‌లో “ఒక చిన్న అద్భుతం.. మాకు లభించిన గొప్ప బహుమతి” అంటూ భావోద్వేగంగా రాసింది. అలాగే 2026 ఆగస్టులో తన బిడ్డకు జన్మనివ్వనున్నట్లు కూడా వెల్లడించింది. ఈ ప్రకటనతో ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా, కరిష్మా తన్నా 2022లో వరుణ్ బంగేరాను వివాహం చేసుకుంది. పెళ్లి జరిగిన నాలుగేళ్లకు ఆమె గర్భవతిగా ఉండటం అభిమానుల్లో మరింత ఆనందాన్ని నింపింది. ఇప్పుడు ఈ జంట తమ జీవితంలోకి రాబోతున్న చిన్నారిని ఆతృతగా ఎదురుచూస్తోంది.