Reading Time: < 1 minute

ఇంద్ర రామ్‌ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ రిలీజ్

Caption of Image.

‘చౌర్య పాఠం’తో ఆకట్టుకున్న ఇంద్ర రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘డోంట్ స్లీప్’. సినిమాటోగ్రాఫర్ షామ్‌‌‌‌దత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వి డ్రీమ్స్ ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  వి చూడామణి నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ను విజయ్ సేతుపతి లాంచ్ చేసి టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ  పోస్టర్‌‌‌‌‌‌‌‌లో రవీంద్ర విజయ్ పాత్ర, తుపాకీతో మంచు పర్వతాల మీదుగా ఇంద్ర రామ్‌‌‌‌ను వెంబడిస్తుండగా, ముందు భాగంలో హీరో కళ్ళు మూసుకుని, నుదుటిపై కట్టుతో కనిపించడం ఆసక్తికరంగా ఉంది.  ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అని, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుందని మేకర్స్ చెప్పారు. తబా రీమా, జ్యోతి బెనర్జీ, సునీల్ థాపా, ఆడుకలం నరేన్, కల్ప లత, అనీష్ కురువిల్లా, వెన్నెల కిషోర్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి  గోకుల్ హర్షన్ సంగీతం  అందిస్తున్నాడు.

 

©️ VIL Media Pvt Ltd.