
క్రీడల్లో రాణిస్తే ఉద్యోగాలు ఇస్తాం
నిఖత్ జరీన్‌కు గ్రూప్1 ఉద్యోగం,
రూ.2 కోట్ల నగదు అందించాం సిరాజ్
పదోతరగతి ఫెయిలైనా, డిఎస్పీ ఉద్యోగం
ఇచ్చాం: సిఎం జాతీయ పోలీస్
ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ముగింపు
వేడుకలకు హాజరు క్రీడాకారులతో
కలసి కాసేపు ఫుట్‌బాల్ ఆడిన రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఎన్ మల్లిక్ ఒక స్పై మాస్టర్ అని, నిఘా వ్యవస్థనను తీర్చిదిద్దడంలో ఆయనది కీలక పాత్ర అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో బిఎన్ మల్లిక్ 74వ మెమోరియల్ జాతీయ పోలీస్ పుట్‌బాల్ ఛాంపియన్ షిప్ ముంగింపు వేడుకలకు సిఎం హాజరయ్యారు. మైదానంలోకి క్రీడా దుస్తులతో ప్రవేశించిన సిఎం ఫైనల్ క్రీడాకారులతో కరచాలనం చేసి కొద్దిసేపు మ్యాచ్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన ముంగింపు వేడుకల్లో విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ భారత పుట్‌బాల్ చరిత్రలో హైదరాబాద్ నగరానికి విశేషమయిన పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయని తెలిపారు. 1950 నుంచి 60 వరకు నర్సరీ ఆఫ్ ఇండియన్ పుట్‌బాల్‌గా హైదరాబాద్‌ను పలిచేవారని, దేశంలో పుట్‌బాల్ ఆటకు అగ్రశ్రేణి క్రీడాకారులను హైదరాబాద్ అందించిందని సిఎం చెప్పారు. 1956 లో ఒలంపిక్స్ లో ఆడిన పుట్‌బాల్ జట్టులో ఏడుగురు హైదరాబాద్‌కు చెందింన క్రీడాకారులు ఉన్నారని, హైద్రాబాద్ పోలీస్ పుట్‌బాల్ టీం కి దేశంలో మంచి పేరుందని సిఎం గుర్తు చేశారు. టోర్నమెంట్‌లో 34 జట్లు అద్భుతమయిన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారని, దేశం నలుమూలల నుంచి క్రీడాకారులు తరలి వచ్చి మంచి ప్రదర్శన కనబరిచిన వారిందరికీ సిఎం అభినందనలు తెలిపారు.
యువత నెమ్మదిగా క్రీడలకు దూరం అవుతున్నారని, క్రీడా మైదానలను వదిలిపెట్టి యువత తప్పు చేస్తున్నారని సిఎం పేర్కొన్నారు. సౌత్ కొరియా లో స్పోర్ట్ యూనివర్శిటీని సందర్శించానని, సుమారు 30 ఎకరాల్లో ఉన్న స్పోర్ట్ యూనివర్శిటీ అనేక బంగారు పతకాలు సాధించిందన్నారు. నాలుగు కోట్ల జనాభా ఉన్న సౌత్ కోరియా 30కి పైగా పతకాలు సాధించిందని, 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒక్కరు కూడా బంగారు పతకం సాధించలేకపోయిందని విచారం వ్యక్తం చేశారు. పబ్, డ్రగ్స్ కల్చర్‌లోకి వెళుతున్న యువత తిరిగి క్రీడా మైదానాల్లోకి రావాలని సిఎం విజ్ఞప్తి చేశారు. పంజాబ్ రాష్ట్రం దేశ స్వాతంత్య్రం కోసం ఒక్కప్పుడు వీరులను అందించిందని, నేడు అక్కడి యువత డ్రగ్స్ బారిన పడ్డారని సిఎం తెలిపారు. రాష్ట్రాన్ని మరో పంజాబ్ కాన్విమని సిఎం తేల్చిచెప్పారు. యువతకు మార్గదర్శనం చేయాలనే హైదరాబాద్‌కు మెస్సీని తీసుకొచ్చామని, ఎస్సీ, ఆదివాసీ పిల్లలకు మెస్సీ కలిసి పుట్‌బాల్ ఆడే అవకాశం కల్పించామని సిఎం తెలిపారు. క్రీడల్లో రాణించే యువతకు ఉద్యోగాలు వస్తాయని సిఎం పేర్కొన్నారు. బాక్సింగ్ ఛాంపియన్ నిక్కత్ జరీనాకు గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు రెండు కోట్ల నగదు పురస్కారం అందించామని, పదవ తరగతి ఫెయిల్ అయిన క్రికెటర్ సిరాజ్‌కు గ్రూప్1 ఉద్యోగం ఇవ్వడానికి అర్హత లేకపోయినా నింబంధనలను సడలించి డిఎస్పి ఉద్యోగం ఇచ్చినట్లు సిఎం గుర్తు చేశారు.