
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డోలీ మోతలు తప్పడంలేదు. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని తడికోట గ్రామంలో చోళ్ల చిన్న రెడ్డి (20) అనే గిరిజనుడు చెట్టుపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడడంతో అతడిని తీసుకెళ్లడానికి ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేదు. కదలలేని స్థితిలో ఉన్న చిన్న రెడ్డిని ఆసుపత్రికి తరలించేందుకు డోలి కట్టి ఐదు కిలోమీటర్లు గిరిజనులు మోసుకెళ్లారు. మధ్యలో ఏడు చోట్ల వాగులను అతి కష్టం మీద దాటాల్సి వచ్చింది., 108 సిబ్బంది సహాయంతో అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేశంలో ఎక్కువ పట్టణ ప్రాంతాలలో ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న గిరిజన్ ప్రాంతాల్లో రోడ్లు, సరైన సదుపాయాలు లేవని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలలో రోడ్లు నిర్మించడంతో, గ్రామాలకు సమీపంలో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. దేశంలో జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు కానీ గిరిజన ప్రాంతాలలో రోడ్లు నిర్మించడంలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర్యం రాకముందు డోలీ మోతలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎక్కడ అభివృద్ధి జరిగిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.