Reading Time: 2 minutes
Indian Railways: వారెవ్వా.. రైళ్లల్లో జనరల్ బోగీలు ముందు లేదా వెనుక ఎందుకుంటాయో తెలుసా..? ఈ రీజన్ తెలిస్తే సూపర్ అంటారు..

భారత్‌లో రైళ్ల ద్వారా లక్షలాది మంది ప్రజలు తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రతీఒక్కరూ ఒక్కసారైనా ట్రైన్ ప్రయాణ అనుభూతిని పొంది ఉంటారు. రైళ్లల్లో ప్రయాణించే సమయంలో ట్రైన్లలోని కొన్ని విషయాలు మీకు అనుమానాన్ని కలిగిస్తాయి. రైళ్లల్లో ఏసీ, స్లీపర్ కోచ్‌లతో పాటు జనరల్ కోచ్‌లు ఉంటాయి. అయితే మీరు చూస్తే జనరల్ కోచ్‌లు ట్రైన్ మొదట్లో లేదా చివర్లో ఉంటాయి. ఇలా ఎందుకుంటాయనే ప్రశ్నలు చాలామందిలో ఉత్పన్నమవుతూ ఉంటాయి. అయితే ఇలా ఉండటం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. రైల్వే భద్రతలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

ప్రమాదాల నుంచి నివారణ

జనరల్ బోగీల్లో ఎక్కువమంది ప్రయాణిస్తుంటారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ కోచ్‌లను రైలు మధ్యలో ఉంచితే ప్రయాణికులందరూ ఫ్లాట్ఫామ్ మధ్య భాగంలోనే గుమిగూడతారు. దీని వల్ల ఇతర కోచ్‌లకు వెళ్లడానికి, దిగడానికి సమస్య ఏర్పడుతుంది. విపరీతంగా రద్దీ కారణంగా తొక్కిసలాట కూడా చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. అదే చివర్లో లేదా మొదట్లో ఉండటం వల్ల రద్దీ చోటుచేసుకోదు. దీని వల్ల ప్రయాణికులు సులువుగా ట్రైన్ బోర్డింగ్ అవ్వొచ్చు.

త్వరగా ఖాళీ చేయించవచ్చు

ఇక జనరల్ బోగీల్లో ప్రయాణికులు ఎక్కువమంది ఉండటం వల్ల ఏవైనా అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు వారిని ఖాళీ చేయించడం కష్టంగా ఉంటుంది. రైలు మధ్యలో ఉంటే సిబ్బంది చేరుకోవడానికి టైమ్ పడుతుంది. అదే చివరిలో లేదా స్టార్టింగ్‌లో ఉండటం వల్ల సిబ్బంది వేగవంతంగా చేరుకుని సహాయక చర్యలు త్వరగా చేపట్టవచ్చు. దీని వల్ల ప్రమాద తీవ్రత తగ్గుతుంది. ఇక మధ్యలో ఈ బోగీలు ఉంటే మిగతా కోచ్‌ల్లో ప్రయాణించేవారు కూడా గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది.

బరువు ఆధారంగా..

ఇక బరువును కూడా పరిగణలోకి తీసుకుని జనరల్ కోచ్‌లను ఇలా ఏర్పాటు చేశారు. జనరల్ బోగీల్లో ప్రయాణికుల రద్దీ కారణంగా బరువు ఎక్కువగా ఉంటుంది. అదే మధ్యలో వీటిని ఉంచితే బరువు సరితూకంగా ఉంటుంది. దీని వల్ల ట్రైన్ ప్రయాణించేటప్పుడు కుదుపులు వచ్చే అవకాశం ఉంటుంది. అదే చివరిలేదా మొదట్లోనే ఉంచడం వల్ల బరువు సమానం అవుతుంది. దీని వల్ల జర్నీలో కుదుపులు కూడా ఉండవు. ఇక జనరల్ బోగీలకు ఇలా ఉండటం వల్ల ప్రయాణికులు కూడా త్వరగా చేసుకోవచ్చు. దీని వల్ల రైలు ఆగే సమయం తగ్గుతుంది. మనకు చూడటానికి సాధారణంగా ఉన్నప్పటికీ.. జనరల్ బోగీలు అలా ఉండటం వల్ల అనేక సేఫ్టీ కారణాలు ఉన్నాయి.