
సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోన్న అన్నదమ్ములు చాలా మందే ఉన్నారు. నందమూరి, మెగా, అక్కినేని, దగ్గుబాటి, మంచు ఫ్యామిలీస్ తో సహా చాలా మంది బ్రదర్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా, సహాయక నటులుగా, దర్శకులుగా, నిర్మాతలుగా సత్తా చాటుతున్నారు. పై ఫొటోలో ఉన్నది కూడా అన్నదమ్ములే. వీరు స్టార్ డైరెక్టర్ వారసులు. తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తమ తండ్రి పేరును నిలబెడుతూ కామెడీ సినిమాల చేస్తూ తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. అయితే గతంలోలా వీరికి ఇప్పుడు విజయాలు దక్కడం లేదు. దీంతో ఒక హీరో క్రమంగా సినిమాలకు దూరమయ్యాడు. మరో హీరో మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఓ వైపు తనకు అచ్చొచ్చిన కామెడీ సినిమాలు చేస్తూనే మరోవైపు సీరియస్ సబ్జెక్టులతో సక్సెస్ లు అందుకుంటున్నాడు. మరి వారెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. అందులో ఉన్నది మరెవరో కాదు ఆర్యన్ రాజేశ్, అల్లరి నరేష్. ఇది వారి చిన్ననాటి ఫొటో. మధ్యలో ఉన్నది వారి తల్లి.
దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ తదితర స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆయన టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. తన సినిమా కెరీర్ లో 51 సినిమాలకు దర్శకత్వం వహించిన ఈవీవీ సత్య నారాయణ 2011లో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈ క్రమంలో ఈవీవీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ సినిమాల్లోకి అడుగుపెట్టారు.
కూతురితో అల్లరి నరేష్..
ఆర్యన్ రాజేష్ కెరీర్ ప్రారంభంలో చాలా మంచి సినిమాలు చేశాడు. అయితే ఆ తర్వాత ఫేడవుట్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ నటుడు తన తండ్రి ప్రొడక్షన్ బ్యానర్ ను రీలాంచ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అల్లరి నరేష్ విషయానికి వస్తే.. కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. చివరిగా గతేడాది 12A రైల్వే కాలనీ అనే సినిమాలో నటించాడు అల్లరోడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో ఆల్కహాల్, సభకు నమస్కారం సినిమాలు ఉన్నాయి.
భార్యతో అల్లరి నరేష్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.