Reading Time: < 1 minute

తెలంగాణ ఫార్మసీ అసోసియేషన్ సెక్రటరీగా నేరెళ్ల ప్రమోద్

Caption of Image.

నిర్మల్, వెలుగు: తెలంగాణ ఫార్మసీ (కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్స్) అసోసియేషన్ సెక్రటరీగా నిర్మల్ కు చెందిన నేరెళ్ల ప్రమోద్ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ లోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో అసోసియేషన్ సీనియర్ నేత నేరెళ్ల ప్రమోద్ కు రాష్ట్ర సెక్రటరీగా అవకాశం దక్కింది.

ఈ సందర్భంగా ప్రమోద్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫార్మసీ దుకాణాల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. యజమానుల న్యాయపరమైన హక్కుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారికి చేయూత అందిస్తామని, అన్ని జిల్లా కేం ద్రాల్లో కొత్త అసోసియేషన్ భవనాల నిర్మాణం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. తనకు అవకాశంఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.