Reading Time: < 1 minute

సిమ్లా: ఓ మాజీ జవాన్ మానవత్వం మరిచిపోయి క్రూరంగా ప్రవర్తించాడు. విచక్షణ కోల్పోయి మానవ జాతికే మచ్చ తెచ్చాడు. జామ కాయలు దొంగలించిందనే నెపంతో బాలికను కట్టేసి ఓ మాజీ జవాన్ చితకబాదాడు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలో జరిగింది. సోషల్ మీడియాలో వీడియో ప్రకారం…. ఉనా ప్రాంతంలో ఓ మాజీ జవాన్‌కు జామ తోట ఉంది. ఓ బాలిక తోటిలోనికి వెళ్లి జామకాయను కోసింది. ఇది గమనించిన మాజీ జవాన్ బాలికను పట్టుకొని రెండు తగిలించాడు. అనంతరం బాలికను ఇంట్లో గొలుసులతో కట్టేశాడు. బాలిక ఎంత బతిమిలాడిన కూడా వదిలిపెట్టలేదు. మానవత్వం కోల్పోయి కర్రతో బాలికను చితకబాదాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ జవాన్‌గా నేర్చుకుంది ఇదేనా అతడి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో వైరల్ కావడంతో సదరు మాజీ జవాన్‌పై బాలల హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం.