Reading Time: < 1 minute

చాట్ జీపీటీతో రిలేషన్‌షిప్స్? దొరికిన సమాచారం అంతా సరైనదేనా: డ్యూడ్ హీరో ప్రదీప్ కామెంట్స్

Caption of Image.

ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించిన  చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఎస్ జె సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించిన ఈ  సినిమా ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతోంది.

ఆదివారం హైదరాబాద్‌‌‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఇదొక న్యూ ఏజ్ కంటెంట్.  2040లో మనం టెక్నాలజీ మీద ఎంత ఆధారపడతామో చాలా ఇన్నోవేటివ్‌‌‌‌గా చూపించారు. ఈ సినిమా బ్లాక్‌‌‌‌బస్టర్ కావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. సరికొత్త కాన్సెప్ట్‌‌‌‌తో  రూపొందిన ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందని దిల్ రాజు అన్నారు.

ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ ‘ఈ రోజుల్లో మనం ప్రతిదీ గూగుల్ లేదా చాట్ జీపీటీని అడుగుతున్నాం. మన రిలేషన్‌‌‌‌షిప్స్, ఎమోషన్స్, ఆరోగ్యం అన్నింటికీ  ఫోన్ మీదే ఆధారపడుతున్నాం. కానీ ఇంటర్నెట్‌‌‌‌లో దొరికిన సమాచారం అంతా సరైనదేనా..? ఇద్దరి మధ్య జరిగేదాన్ని వాళ్లిద్దరికే తెలుసు, కానీ చాట్ జీపీటీకి తెలియదు. 

ఇప్పుడు 2026లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, 2040లో ఎలా ఉంటుంది? మనుషుల కంటే మిషన్స్ మీద నమ్మకం పెరుగుతుంది. మిషన్ ఎవరి పెళ్లి ఎవరితో అవ్వాలో కూడా చెప్పే స్థితి వస్తుంది.అలాంటి పరిస్థితిలో.. ఒక అప్లికేషన్ మనకి సరైన పార్టనర్​ఎవరో చెబితే..? దానిపై ప్రేమను నమ్మగలమా..? ఇదే ఈ సినిమా ప్రధాన కథాంశం’ అని చెప్పాడు. హీరోయిన్ కృతిశెట్టి, నటుడు ఎస్‌‌‌‌జే సూర్య, డైరెక్టర్ విఘ్నేష్​ శివన్,  డిస్ట్రిబ్యూటర్ శివప్రసాద్ పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.