
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తోంది. టెహ్రాన్‌లోని జనావాసాలపై క్షిపణి దాడులు చేయడంతో 13 మంది చనిపోయమారు. మృతులలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. టెహ్రాన్‌లోని షరీఫ్ యూనివర్సిటీపైనా దాడులు చేశారు. యుద్ధ కారణంగా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు ఏర్పాటు చేశామన్నారు. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్ పై అమెరికా భీకర దాడులు చేయడంతో సహజవాయువు సరఫరా చేసే పైప్ లైన్లు ధ్వంసమయ్యాయి. హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. 48 గంటల్లో హార్మూజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్ లో విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై భీకర దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించిన విషయం విధితమే. కువైట్ పై ఇరాన్ డ్రోన్లతో దాడి చేయడంతో విద్యుత్ కేంద్రం, షువైక్ చమురు సెక్టార్, పెట్రో కెమికల్ స్థావరం పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.