ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ధరలు మెల్లమెల్లగా పెరుగుతూ వాహనదారులకు షాకిస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ పెట్రోలియం సంస్థలు ధరలను పెంచడంలో ప్రజలపై భారం పడుతోంది. ఇక పవర్ పెట్రోల్, పారిశ్రామిక డీజిల్ ధరలు పెరిగాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీంతో రానున్న రోజుల్లో ఇంధన ధరలు పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధర రూ.107గా ఉంది. ప్రాంతాలను బట్టి ధరలు మారుతూ ఉంటాయి. ఇక డీజిల్ ధర రూ.100గా కొనసాగుతోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండగా.. ఒక ప్రాంతంలో మాత్రం తక్కువ ధరకే లభిస్తోంది. లీటర్ పెట్రోల్ కేవలం రూ.82కే దొరుకుతుండగా.. డీజిల్ రూ.78 పలుుతోంది. అది ఎక్కడో కాదు..
అండమాన్ నికోబార్ దీవుల్లో పెట్రోల్, డీజిల్ తక్కువ రేటుకు దొరుకుతుంది. దేశంలోనే అతి తక్కువ ధరకు ఇక్కడ లభిస్తున్నాయి. దేశంలోని మిగతా ప్రాంతాలో పోలిస్తే రూ.20 తక్కవకు ఇక్కడ దొరుకుతుంది. ఇక దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ లాంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ లభిస్తున్నాయి. దీనికి కారణాలు ఏంటంటే..
కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్దానిక పన్నులు తక్కువగా ఉంటాయి. రాష్ట్రాల జోక్యం ఉండకపోవడం వల్ల కేవలం కేంద్రం విధించే పన్నులు మాత్రమే అక్కడ అమలవుతున్నాయి. కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే ఇక్కడ ఉండగా.. అదనపు సెస్‌లు తక్కువగా ఉన్నాయి. ఎక్సైజ్ సుంకంతో పాటు రాష్ట్రాలు 35 శాతం వరకు వ్యాట్ వసూలు చేస్తున్నాయి. కేంద్ర పాలిత రాష్ట్రాల్లో ఇవి ఉండవు.
ఇక రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు అభివృద్ది, కాలుష్య నియంత్రణ, సామాజిక సంక్షేమ వంటి ప్రత్యేక ట్యాక్సులు విధిస్తూ ఉంటాయి. ఇక రవాణా ఖర్చులు, పెట్రోల్ బంక్ యజమానుల కమిషన్ వంటివి ధరలను నిర్ణయించడంలో కీలకంగా ఉంటాయి. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ ట్యాక్సులు తక్కువగా ఉన్నాయి. దీంతో అక్కడ ధరలు తక్కువగా ఉంటున్నాయి.




