Reading Time: < 1 minute

ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలి : మాజీ ఎమ్మెల్యే ఎండీ షకీల్

Caption of Image.

బోధన్, వెలుగు: వడగండ్లకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం  ఇవ్వాలని బోధన్​మాజీ ఎమ్మెల్యే ఎండీ షకీల్​డిమాండ్​చేశారు. ఆదివారం సాలూర మండలంలోని  మందర్నా, హున్సా, ఖజాపూర్ శివారులోని వరి, మొక్కజొన్న, మామిడి, అరటిపండ్ల తోటలను పరిశీలించారు. వడగండ్లతో మూడు గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడు సార్లు పంటలు నష్టం జరిగినా ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. ఆయన వెంట సాలూర మండల బీఆర్ఎస్​అధ్యక్షుడు జె.నర్సయ్య, రైతులు ఉన్నారు. 

పంటలను పరిశీలించిన కాంగ్రెస్​ పార్టీ నాయకులు 

సాలూర మండలంలోని మందర్నా, హున్సా, ఖజాపూర్​ గ్రామాలలో  వరి, మొక్కజోన్న, అరటి, మామిడి తోటలను కాంగ్రెస్​డీసీసీ ప్రెసిడెంట్​డెలిగెట్​గంగాశంకర్​, బోధన్​, సాలూర మండలాల కాంగ్రెస్​ అధ్యక్షులు నాగేశ్వరరావు, మందర్నా రవి, నాయకులు పంటలను పరిశీలించారు. ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్​రెడ్డికి పంటల నష్టంపై వివరించి నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రైతులు అందోశన చెందవద్దని భరోసా ఇచ్చారు.  

©️ VIL Media Pvt Ltd.