
చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరులోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆదివారం రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి దిష్టిబొమ్మను దహనం చేసి, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎనిమిది మంది బీఆర్ఎస్అనుబంధ బీఆర్ఎస్వీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బన్సీలాల్తెలిపారు.
లీడర్లు బడికల శ్రావణ్, ఎండీ నాయబ్, కొప్పుల రవీందర్, రేణుకుంట్ల శ్రీనివాస్, తుంగపిండి నవీన్, చిలుముల సంపత్, సార్ల శివ, తగరం మహేందర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. చట్ట వ్యతిరేకంగా, ప్రజా శాంతికి భంగం కలిగేలా ఎవరైనా ప్రవర్తించినా, ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.