Reading Time: < 1 minute

రోడ్డు యాక్సిడెంట్ తర్వాత ట్రీట్ మెంట్ కోసం..ఫోర్ లెవెల్ ట్రామా కేర్ సిస్టమ్

Caption of Image.

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్‌‌‎తో ముందుకెళ్తున్నది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్‎లోనే బాధితులకు మెరుగైన వైద్యం అందించి మృత్యువు నుంచి తప్పించేలా చర్యలు చేపట్టబోతున్నది. ఇందుకోసం ప్రభుత్వం స్టేట్ ట్రామా కేర్ పాలసీని రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా హైవేల ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. 

ఫోర్ లెవెల్ చైన్ సిస్టమ్..

యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి పేషెంట్ కండిషన్‌‌‎ను బట్టి వైద్యం అందేలా ఈ నెట్‌‌ వర్క్‌‎ను డిజైన్ చేశారు. మొత్తం నాలుగు లెవెల్స్‎లో సర్వీస్‎లను విభజించి చికిత్సను అందించేలా ప్లాన్ చేస్తున్నారు. నాలుగో లెవెల్‎లో ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్‌‎కు చేరుకునే 108 అంబులెన్స్ ఇక్కడ మొదటి రెస్పాండర్‌‎గా పనిచేస్తుంది. అంబులెన్స్‌‎లోనే ప్రైమరీ ట్రీట్మెంట్ చేస్తూ దగ్గరలోని సెంటర్‌‏కు తరలిస్తారు. ఇందుకోసం ప్రతి ట్రామా కేర్ సెంటర్‎కు ఒక అంబులెన్స్‎ను ఏర్పాటు చేయనున్నారు. 

మూడో లెవెల్‎లో జిల్లా హాస్పిటల్స్‎లో ఏర్పాటు చేయనున్న ట్రామాకేర్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తారు. రెండో లెవెల్‎లో జిల్లాల్లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్(టీచింగ్ హాస్పిట్స్)లో ట్రామా ట్రీట్మెంట్, మేజర్ సర్జరీలు చేస్తారు. ఇక ఫైనల్‎గా మొదటి లెవెల్‎లో అత్యంత విషమంగా ఉన్న కేసులను హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, త్వరలో ప్రారంభించబోయే టిమ్స్ తోపాటు వరంగల్‌‌ లోని ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్​కు తరలించి అడ్వాన్స్‌‌డ్ ట్రీట్‌‌మెంట్ అందిస్తారు.
 

©️ VIL Media Pvt Ltd.