
గత కొంతకాలంగా కళ తప్పిన తెలుగు బాక్సాఫీస్ ఏప్రిల్ 2026లో తిరిగి సందడిని చూస్తుందా అనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. సంక్రాంతి సీజన్‌తో పాటు ఇటీవల ధురంధర్ 2 విజయం కొంత ఊరటనిచ్చింది. ఈ వారం విడుదలైన బైకర్ రాకాసా వంటి చిత్రాలు ప్రీమియర్‌ల నుంచే మంచి టాక్‌ను అందుకోవడంతో ప్రేక్షకులు వినోదాన్ని పొందే అవకాశం ఉంది. ఏప్రిల్ 2026లో పలు ఆసక్తికరమైన చిత్రాలు విడుదల కానున్నాయి. అడవి శేష్ నటించిన డెకాయిట్ ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా కమర్షియల్ హీరోగా డాన్స్‌లు చేస్తూ కనిపించనున్నారు. అదే రోజున, ప్రదీప్ రంగనాథన్ నటించిన ఎల్.ఐ.కె. కూడా తెరపైకి రానుంది. విగ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్వయంభూ సైతం ఏప్రిల్‌లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది, దీనిపై భారీ అంచనాలున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :