Reading Time: 2 minutes

మన తెలంగాణ/మోత్కూర్: బాబు జగ్జీవన్ రావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పిలుపునిచ్చారు. బాబు జగ్జీవన్ రావు 119వ జయంతి సందర్భంగా ఆదివారం మోత్కూరులో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన బాబు జగ్జీవన్ రావు జయంతి సభలో ఎమ్మెల్యే మందుల సామేల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి జగ్జివన్ రావు అని ఆయన సేవలను కొనియాడారు బాబు జగ్జీవన్ రావు 50 ఏళ్లు పార్లమెంట్ సభ్యుడుగా పనిచేయడంతో పాటు దేశ ఉప ప్రధానిగా సేవలందించారన్నారు. స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన గొప్ప మహనీయుడు జగ్జీవన్ రావు అని పేర్కొన్నారు.

తండ్రి సేవలను అనుసరిస్తూ తన కుమార్తె మీరాకుమారి లోక్ సభ స్పీకర్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, అధ్యక్షతన వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ కే సతీష్ కుమార్, కౌన్సిలర్లు కురిమిళ్ల ప్రమీల రాములు, మొగుళ్ళ అనురాధ శ్రీనివాస్ రెడ్డి,గనగాని శైలజ నర్సయ్య, పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి, బీసు శ్రీకాంత్ గౌడ్, నల్ల మధు, కారుపోతుల వెంకన్న గౌడ్, మెంట రమణ నాగేష్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పైళ్లసోమిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గుర్రం లక్ష్మీ నర్సింహ్మరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్రు, రాచకొండ బాలరాజు, మార్కెట్ డైరెక్టర్ లు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, ఎం డి.సమీర్, నాయకులు జినుకల కనకయ్య, మందుల సురేష్, శేఖర్ ఆచారి, బందెల రవి తదితరులు పాల్గొన్నారు.

వివిధసంఘాల ఆధ్వర్యంలో …….

బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్లవీరేందర్ గౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, గౌరు శ్రీనివాస్, చాడ మంజుల సజ్జన మనోహర్, పోచం సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

 

బీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో….

బాబు జగ్జీవన్ రావు జయంతి పుష్కరించుకొని బీఆర్ ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ మండల ,పట్టణ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్,జంగ శ్రీను, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చిప్పలపల్లి మహేంద్ర నాథ్, కొనతం యాకూబ్ రెడ్డి , నాయకులు కొండా సోం మల్లు, గజ్జి మల్లేష్ , క్రాంతి కుమార్ రెడ్డి, తిరుమలేష్, రఘుపతి, వెంకన్న, శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

 

ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో …….

బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు కూరెళ్ళ యాకస్వామి,మందుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.