Reading Time: 2 minutes
Ms Dhonis Cute Calm Down Reaction To Sakshi Goes Viral During India Vs England Match

Sakshi Dhoni Reaction: గత రాత్రి ముంబైలోని వాంఖెడే స్టేడియం స్టేడియం వేదికగా ఓ చిన్నపాటి సమరమే జరిగింది. భారత్, ఇంగ్లాండ్ ఇరుజట్ల బ్యాటర్స్ తగ్గేదెలా.. అన్నట్లుగా పరుగుల సునామి సృష్టించారు. అయితే చివరకు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ లో భారత్ విజయం సాధించి మరోసారి వరల్డ్ కప్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన సంఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తుంది.

World Cup Sentiment: 2011 సెంటిమెంట్ రిపీట్.. 2026లో భారత్కే ప్రపంచకప్?

ఇంతకీ ఆ వీడియో ఏంటి? అనే కదా మీ అనుమానం. అక్కడే వస్తున్నాం.. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ, ఆయన భార్య సాక్షి ధోనీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ లో ఇరుజట్లు విజయం కోసం నువ్వా.. నేనా.. అని పోరాడుతున్న సమయంలో, జస్ప్రీత్ బుమ్రా వేసిన ఒక బంతిని చూసి వికెట్ పడిందని సాక్షి పొరపాటుపడి గట్టిగా కేకలు వేస్తూ, ఉత్సాహంగా సెలబ్రేషన్స్ చేసుకోవడం మొదలు పెట్టింది.

Vrushakarma : ‘వృషకర్మ’ గ్లింప్స్‌లో విలన్ హైలైట్‌పై నాగచైతన్య క్లారిటీ

అయితే అది చూసిన ధోని అది వికెట్ కాదని, కేవలం ‘బంప్ బాల్’ (నేలను తాకిన బంతి) అని చెబుతూ.. వెంటనే పక్కనే ఉన్న సాక్షి వైపు తిరిగి సైగ చేస్తూ ప్రశాంతంగా ఉండమని సూచించారు. దానితో సాక్షి ఒకింత మొహం చిన్నబుచ్చుకున్నట్లైంది. కానీ సాక్షి అత్యుత్సాహం.. దానికి ధోనీ ఇచ్చిన స్పందన నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా క్రికెట్ మైదానంలో ధోనీ ఎంత ప్రశాంతంగా ఉంటారో.. తన వ్యక్తిగత జీవితంలో కూడా అంతే ‘మిస్టర్ కూల్’ అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. సాక్షి ఒక నిజమైన క్రికెట్ అభిమానిలా ఎంతో ఎమోషనల్‌గా స్పందిస్తే, ధోనీ మాత్రం తనదైన శైలిలో భార్యని శాంతింపజేయడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ వైరల్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇంకెందుకు ఆలశ్యం ఈ వైరల్ వీడియోను చూసి మీకేమనిపించిందో ఓ కామెంట్ చేసేయండి.