Reading Time: < 1 minute

హైదరాబాద్: తమిళ స్టార్ హీరో, టివికె పార్టీ అధినేత విజయ్ నటించి ‘జననాయగన్’ సినిమా విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించి ఐదు నిమిషాల వీడియో లీక్ అయింది. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. ‘‘జననాయగన్’ చిత్రం దురదృష్టవశాత్తు లీక్ కావడం నన్నెంతో ఆందోళనకు గురి చేసింది. నమ్మకం, శ్రమ, ఎంతో మంది సమష్టి కలల సమాహారమే సినిమా. ఇలాంటి సంఘటనలు పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి. మన క్రియేటివ్ వర్క్‌ని కాపాడుకోవడం ఎంత కీలకమో గుర్తు చేస్తుంటాయి. ఈ నష్టాన్ని అరికట్టడంలో, దోషులను శిక్షించడంలో మేమంతా ఏకతాటిపై కెవిఎన్ ప్రొడక్షన్స్‌కు మద్దతుగా నిలుస్తాం. సినిమాను గౌరవించి, పరిరక్షించేందుకు మనమందరం మన మద్దతును అందిద్దాం’’ అంటూ మెగాస్టార్ పేర్కొన్నారు.