Reading Time: < 1 minute
Israel Lebanon Airstrikes Us Pressure Iran Ceasefire Risk

Israel: ఓ వైపు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ మరోవైపు, ఇజ్రాయిల్ లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. హిజ్బోల్లా లక్ష్యంగా భీకరదాడులు చేస్తోంది. ఇజ్రాయిల్ దాడులు ఇరాన్,యూఎస్ మధ్య కాల్పుల విరమణకు ముప్పు తెచ్చాయి. లెబనాన్‌పై దాడులు తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను కోరిన కొద్దిసేపటికే లెబనాన్‌లోని రెండు పట్టణాలపై ఇజ్రాయిల్ దాడులు చేసింది.

Read Also: Municipal Elections: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధం.. ముహూర్తం అప్పుడే.

మొత్తంగా చూస్తే ట్రంప్‌ను అసలు నెతన్యాహూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ‘ఉల్లంఘించిందని’ ఆరోపిస్తూ, దానికి ప్రతిస్పందనగా తాము కూడా ఉత్తర ఇజ్రాయెల్ పట్టణాన్ని లక్ష్యంగా చేసుకున్నామని లెబనాన్‌లోని ఇరాన్ అనుచర సంస్థ హిజ్బుల్లా తెలిపింది. శుక్రవారం ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు సమీపంలోని కిరియత్ ష్మోనాపై, ఉత్తర ఇజ్రాయెల్‌లోని అప్పర్ గలీలీ ప్రాంతంలో ఉన్న మిస్గావ్ ఆమ్‌పై రాకెట్లను ప్రయోగించినట్లు ఈ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మా దేశం, మా ప్రజలపై ఇజ్రాయిల్, అమెరికా దురాక్రమణ ఆగే వరకు ఈ ప్రతిస్పందన ఇలాగే కొనసాగుతుందని ప్రకటనలో పేర్కొంది.

అమెరికా కుదుర్చుకున్న ఒప్పందంలో లెబనాన్‌పై దాడుల్ని ఆపేయడం కూడా ఉందని టెహ్రాన్ చెబుతోంది. అయితే అలాంటిదేం లేదని ఇజ్రాయిల్, అమెరికా వాదిస్తున్నాయి. ఇలాగే లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగితే కాల్పుల విరమణ ఉండదని ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ హెచ్చరించింది. ఇజ్రాయిల్ దాడులు వల్ల చర్చల ప్రక్రియ నిలిపివేయబడుతుందని పేర్కొంది.