Reading Time: < 1 minute

తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పాత నోట్లు..టిటిడి ఖజానాలో రూ.400 కోట్ల పాత నోట్లు…

Caption of Image.

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తోన్న సంగతి తెలిసిందే. వేసవి సెలవులు కూడా రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తోచినంతలో నగదు, బంగారం, వెండి లాంటి ఆభరణాలు సమర్పిస్తుంటారు. అయితే ఆ వడ్డికాసుల వాడికి చెల్లని రద్దయిన పాత కరెన్సీ నోట్లు వేస్తున్నారు కొందరు గొప్ప భక్తులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు 400 కోట్లు టిటిడి దగ్గర ఉన్నాయట. 

అయితే రద్దైన పాత నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ అనుమతించకపోవడంతో టిటిడి ఖజానాలో మగ్గుతున్నాయి పాత నోట్లు. ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్బీఐని టిటిడి వేడుకుంటున్నా ఫలితం లేకుండా పోతోందని చెబుతున్నారు టీటీడీ అధికారులు. దీంతో వాటిని ఏం చేయాలో తెలియక టిటిడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు రద్దయిన రూ.2 వేల నోట్లను మాత్రం బ్యాంకులు స్వీకరిస్తున్నాయి.

శ్రీవారి హుండీలో భక్తులు వేసిన నగదు రోజుకు సుమారుగా అటు ఇటు 4 కోట్లు, నెలకు దాదాపు 130 కోట్లు, ఇక ఏడాదికి సరాసరి 1500 కోట్లకు పైగా చేరుతోందని తెలిపారు అధికారులు. పాత నోట్లు రద్దయి పదేళ్ళవుతున్నా, ఇంకా ఇప్పటికీ భక్తులు చెల్లని నోట్లను హుండీ లో చేస్తూనే ఉన్నారని చెబుతున్నారు అధికారులు. చెల్లని పాత కరెన్సీ నోట్లు కుప్పలు కుప్పలుగా టిటిడి ఖజానాలో పేరుకుపోయాయని తెలిపారు

©️ VIL Media Pvt Ltd.