Reading Time: 2 minutes

IPL 2026: రాజస్థాన్ వర్సెస్ ఆర్సీబీ మధ్య కీలక పోరు.. ఎవరు గెలుస్తారో తెలుసా!

Caption of Image.

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 2026, ఏప్రిల్ 10న గువాహాటిలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు రెండు జట్లూ అద్భుత ఫామ్‌లో ఉన్నాయి. రాజస్థాన్ మూడు మ్యాచ్‌లలో విజయం సాధించగా, బెంగళూరు రెండు మ్యాచ్‌లలో గెలిచి మంచి ఊపులో కనిపిస్తుంది. ఈ కీలక పోరులో ఎవరు గెలుస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. రాజస్థాన్ తరఫున యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడుతుండగా, బెంగళూరు తరఫున విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు.
 
* వైభవ్ సూర్యవంశీ vs భువనేశ్వర్ కుమార్
ముంబై ఇండియన్స్ తో జరిగిన గత మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా లాంటి దిగ్గజ బౌలర్‌నే ఫోర్లు, సిక్సర్లతో భయపెట్టిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఈరోజు అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్‌ను ఎదుర్కొంటాడనే టాక్ కొనసాగుతుంది. అయితే గతంలో వీరిద్దరూ తలపడినప్పుడు వైభవ్ రెండు సిక్సర్లు బాదగా, భువీ వెంటనే అతడిని క్లీన్ బౌల్డ్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ ‘యువ రక్తం vs అనుభవం’ పోరు పవర్‌ప్లేలో కీలకంగా మారనుంది. 

* కోహ్లీ vs రాజస్థాన్ బౌలింగ్:  
విరాట్ కోహ్లీని అడ్డుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ దగ్గర రెండు పక్కా ప్లాన్లు ఉన్నట్లు తెలుస్తుంది. సందీప్ శర్మ బౌలింగ్‌లో కోహ్లీ ఇప్పటి వరకు 7 సార్లు అవుట్ అయ్యాడు. అతడు వేసే స్వింగ్ బంతులను ఎదుర్కోవడంలో కోహ్లీ సగటు కేవలం 18.9 మాత్రమే ఉంది. అలాగే లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ గతంలో కోహ్లీని, ఫిల్ సాల్ట్‌ను కట్టడి చేయడంలో విజయవంతమయ్యాడు. కోహ్లీ క్రీజులో సెటిల్ అయితే బిష్ణోయ్‌ను రంగంలోకి దించే ఛాన్స్ ఉంది. కోహ్లీకి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల (నాండ్రే బర్గర్) బౌలింగ్‌లో కొంత ఇబ్బంది పడతాడు.. ఐపీఎల్‌లో కోహ్లీని లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు 42 సార్లు అవుట్ చేశారు.

ALSO READ : బెంగళూరు vs రాజస్థాన్ మధ్య బిగ్ ఫైట్.

* టిమ్ డేవిడ్ vs రవి బిష్ణోయ్: 
గత మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లోనే 70 రన్స్ చేసి విధ్వంసం సృష్టించిన టిమ్ డేవిడ్‌ను అడ్డుకోవడం రాజస్థాన్ రాయల్స్ జట్టుకి సవాలే. అయితే, బిష్ణోయ్ గూగ్లీలకు టిమ్ డేవిడ్ గతంలో పలుమార్లు ఔట్ అయ్యాడు. డెత్ ఓవర్లలో వీరిద్దరి మధ్య పోరు మ్యాచ్ ఫలితాన్ని మార్చే అవకాశం ఉంది. 

ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటే: 
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొంత మేర బలంగా కనిపిస్తుంది. దీంతో రాజస్థాన్ మూడు మ్యాచ్‌లు గెలిచి జోరు మీద ఉన్నప్పటికీ, బ్యాటింగ్ లో డెప్త్, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఈ మ్యాచ్‌లో బెంగళూరుకు గెలిచేందుకు స్వల్ప ఆధిక్యం ఉందని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. 

రాజస్థాన్ రాయల్స్:
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (wk), రియాన్ పరాగ్ (C), షిమ్రాన్ హెట్మెయర్, డి. ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్.
ఇంపాక్ట్ ప్లేయర్: తుషార్ దేశ్‌పాండే.

ALSO READ : RR vs RCB మ్యాచ్ కి వర్ష సూచన..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (C), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (wk), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, అభినందన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ.
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ.
 

©️ VIL Media Pvt Ltd.