Reading Time: 2 minutes
ఇది కదా నిజమైన స్నేహం.. జాతి వైరం మరిచిన గోమాత, కుక్క బంధానికి హాట్సాఫ్..!

ప్రతిరోజూ సోషల్ మీడియాలో వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ కొన్ని వీడియోలు ప్రజల హృదయాలను తాకుతాయి. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో ఒక కుక్క తన నోటితో రొట్టె ముక్కను పట్టుకుని ఆవుకు తినిపిస్తోంది. ఈ దృశ్యం ప్రజలను ఆశ్చర్యపరిచి, భావోద్వేగానికి గురిచేసింది. ఈ జంతువుల మధ్య స్నేహం మానవుల గురించి కూడా ఆలోచింపజేసిందని నెటిజన్లు అంటున్నారు.

ఒక నల్ల కుక్క నోటిలో రొట్టె ముక్కతో వేగంగా నడుస్తూ కనిపించింది. అది ఏమాత్రం భయం.. సంకోచం లేకుండా ఒక ఆవు దగ్గరకు వెళ్లింది. ఆ తర్వాత ఆ రొట్టె ముక్కను ఆవు ముందు పెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎవరో ఈ దృశ్యం మొత్తాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది త్వరగా వైరల్ అవుతోంది. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి తాను ఆ కుక్కను అనుసరిస్తున్నానని వివరించాడు. ఆ కుక్క ఒక రొట్టె ముక్కతో నేరుగా ఆవు వద్దకు వచ్చి దానికి తినిపించిందని అతను చెప్పాడు. వీడియో చివరలో, ఆ వ్యక్తి భావోద్వేగానికి లోనై, ఈ రోజుల్లో మానవత్వం క్షీణిస్తోందని, కానీ ఇక్కడ జంతువుల మధ్య ప్రేమను చూడటం హృదయానికి హత్తుకునేలా ఉందని పేర్కొన్నాడు.

వైరల్ వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు రకరకాలుగా స్పందించారు. చాలామంది దీనిని నిజమైన స్నేహం అని అన్నారు. మనం జంతువుల నుండి నిస్వార్థ ప్రేమను, సహాయాన్ని నేర్చుకోవాలని కొందరు అన్నారు. జంతువుల వల్ల స్నేహాన్ని నేర్చుకోవాలని మరికొందరు రాశారు. ఇంకొందరు, “ఈ నిజమైన స్నేహానికి వందనం” అని కూడా రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..