
ఉచిత చీరల పంపిణీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ ఏడాది కూడా మహిళలకు ఉచిత చీరల పంపిణీని కొనసాగించాలని.. అయితే గతంలో మాదిరి కాకుండా ఈ ఈసారి చిలకపచ్చ రంగు, ఎరుపు జరీ డిజైన్తో కూడిన చీరలను సీఎం రేవంత్రెడ్డి ఎంపిక చేశారు. మహిళలకు ఇచ్చే అన్ని చీరలు ఇదే డిజైన్‌లో ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో సుమారు కోటి చీరల తయారీ కోసం రూ.450 కోట్లతో టెస్కోకు అధికారులు ఆర్డర్ ఇచ్చారు. సిరిసిల్ల సహా పలు జిల్లాల నేత కార్మికులకు ఈ పనులు అప్పగించనున్నారు. నవంబరు 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వీటిని పంపిణీ చేయనున్నారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నవంబరు 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ చీరల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే గతేడాది రాష్ట్రంలోని సుమారు 86 లక్షల మందికి చీరలను అందజేసింది. అయితే ప్రతి ఏడాది ఒకటే రంగు కాకుండా ఈ సారి మార్పులు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సెర్ప్, మెప్మాల సీఈవో దివ్యాదేవరాజన్‌లు కొన్ని నమూనాలను సిద్ధం చేసి వాటిని సీఎం దృష్టికి తీసుకురాగా.. వాటిలో చిలకపచ్చ రంగు, ఎరుపు డిజైన్‌తో ఉన్న చీరలను సీఎం ఎంపిక చేశారు.
అయితే ఈ సారి పంపిణీలో విషయంలో గతంలో జరిగిన తప్పులు తలెత్తవద్దని అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఒకే సారి చీరలను పంపిణీ చేయాలన్నారు. అక్టోబర్ నాటికి చీరల తయారీ పూర్తి చేసి నవంబర్‌లో ఇందిరాగాంధీ జయంతికి వాటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.