
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హరియాణాలో దారుణ హత్యకు గురయ్యాడు. బండ్ల రుషికేశ్(27) పది రోజుల క్రితం పంచకులవేది టెక్నాలజీస్ సంస్థలో చేరాడు. ఈ రోజు కంపెనీలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న గుడివాడ పోలీసులు బేతవోలులోని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హరియాణాకు బయలుదేరారు. అయితే హత్యకు గల కారణాలు.. ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.