Reading Time: < 1 minute
Allu Arjun Remuneration For Raaka Rs 175 Cr Salary Rs 1000 Cr Budget Creates New Record

Allu Arjun Remuneration for Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఈ సినిమా సోషల్ మీడియాలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్లకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది. ప్రాథమికంగా ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కోసం రూ. 800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం ఈ బడ్జెట్ రూ.900 నుంచి రూ.1000 కోట్ల వరకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కోసం నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేస్తున్నారట.

ఈ భారీ ప్రాజెక్టులో నటీనటుల రెమ్యునరేషన్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రాకా సినిమా కోసం అల్లు అర్జున్ దాదాపు రూ.175 కోట్ల భారీ పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేకి దాదాపు రూ.25 కోట్లు చెల్లిస్తున్నట్లు సమాచారం. కీలక పాత్రలో కనిపించనున్న రష్మిక మందన్నకు రూ. 5 నుంచి 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు టాక్.

Also Read: Athidi Release: ‘అతిథి’ రీ-రిలీజ్.. సాహసోపేతమైన నిర్ణయం, వర్కౌట్ అవుతుందా?

రాకా సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగం కేవలం విజువల్స్ కోసమే కాకుండా.. అల్లు అర్జున్ పోషించబోయే ‘మృగం’ లాంటి విభిన్నమైన అవతారం కోసం వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఈ లుక్ కోసం చేసే మేకప్, కాస్ట్యూమ్స్, గ్రాఫిక్స్ భారతీయ తెరపై మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతున్నాయట. 2027లో ప్రేక్షకుల ముందుకు రానున్న రాకా చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ బడ్జెట్, అగ్ర తారాగణం, అట్లీ మేకింగ్ స్టైల్ అన్నీ కలిపి రాకాను గ్లోబల్ లెవల్ సినిమాగా నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.