
ఎన్నో ప్రత్యేకతలతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ సిటీని.. కల్తీలో కూడా నెంబర్ వన్ చేయాలని డిసైడయినట్లున్నారు. ఏ ఆహారం చూసినా కల్తీ చేస్తూ జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కల్తీరాయుళ్లు. శుక్రవారం (2026 ఏప్రిల్ 10) బాలాపూర్ కోల్డ్ స్టోరేజ్ పై దాడులు చేసిన అధికారులు.. గుట్టలు గుట్టలుగా పడిఉన్న కుళ్లిపోయిన మాసం చూసి షాకయ్యారు. దాదాపు వాంతులు చేసుకున్నంత పనైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాలాపూర్ పోలీసులు, GHMC అధికారులు సంయుక్తంగా సలామి కోల్డ్ స్టోరేజ్ లో తనిఖీలు నిర్వహించారు. కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ పెట్టిన మాంసాన్ని గుర్తించారు. పక్కా సమాచారంతో పక్కా సమాచారంతో మదీనా కాలనీ లోనీ సలామి ఇండస్ట్రీ కోల్డ్ సోరేజ్ పై దాడి చేశారు అధికారులు. సంచులలో నింపిన టన్నుల కొద్దీ మాంసాన్ని చూసి షాకయ్యారు. కుళ్లిపోయి, బూజు పట్టిన స్థితిలో ఉన్న మాంసం దుర్వాసన కొడుతుండటంతో అధికారులు ఇబ్బందులకు గురయ్యారు.
►ALSO READ | సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం… సాల్వెంట్ ఫ్యాక్టరీలో మంటలు..
కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న మాంసాన్ని సీజ్ చేసిన అధికారులు.. మాంసం ఇండస్ట్రీ ఓనర్స్ పై చర్యలకు సిద్ధమయ్యారు. ఇలాంటి ఇండస్ట్రీలపై బాలాపూర్ పోలీస్ లు మరింత ఫోకస్ పెంచారు. మొత్తం ఐదు స్టోరేజీల నిండా కుళ్ళిపోయిన కాళ్లు ,తలకాయలు, మాంసం ఉన్నట్లు భావిస్తున్నారు. మొదటి స్టోరేజ్ లోనే ఇంత ఘోరమైన పరిస్థితులను చూసిన అధికారులు.. వరుసగా అన్ని స్టోరేజీలను చెక్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆహారాన్ని నిల్వ ఉంచిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.