Reading Time: 2 minutes
Tollywood: ఎంతలా మారిపోయింది! ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఆమె ప్రజెంట్ టాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్. చాలా మంది హీరోయిన్ల లాగే ఈ బ్యూటీ కూడా మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించింది. కొన్ని ఫేమస్ యాడ్స్ లోనూ నటించింది. అలాగే కొన్ని సినిమాల్లో బాల నటిగా మెప్పించింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది. సుమారు పదేళ్లుగా తెలుగులో సినిమాలు చేస్తుందీ అందాల తార. అయితే గ్లామర్ పాత్రలు కాకుండా కేవలం నటనకు ప్రాధాన్యమున్న సినిమాలనే ఎంచుకుంటోంది. అందుకే ఈ పదేళ్ల కాలంలో బహుశా ఓ 10-12 సినిమాలు మాత్రమే చేసింది. అయితే ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ప్రభాస్, నాని, నాగ శౌర్య, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, శర్వానంద్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. ఇప్పుడు ఈ హీరోయిన్ ప్రస్తావన ఎందుకంటే.. లేటెస్ట్ గా ఈ బ్యూటీ నటించిన ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అయితే ఇప్పటివరకు ఎక్కువగా ట్రెడిషినల్ రోల్స్ లోనే కనిపించిన ఈ ముద్దుగుమ్మ మొదటిసారిగా ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపించింది. మరి పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు ఈ ముద్దుగుమ్మ లక్కీ హీరోయిన్. ఆయన ఇప్పటివరకు మూడు సినిమాలు తీస్తే ప్రతి సినిమాలోనూ ఈ బ్యూటీ నటించింది. అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఆ మధ్యన ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమాలోనూ ఓ క్యామియో రోల్ పోషించింది. ఈపాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఆమె మరెవరో కాదు మాళవికా నాయర్.

ఇక పై ఫొటో విషయానికి వస్తే.. ఇది 2012 నాటిది. కెరీర్ ప్రారంభంలో కొన్ని మలయాళ సినిమాల్లో బాల నటిగా చేసింది మాళవికా నాయర్. ఉస్తాద్ హోటల్, కర్మయోధ, పుత్తియా తీరంగల్, బ్లాక్ బటర్ ఫ్లై, కుకూ వంటి సినిమాల్లో డీ గ్లామరస్ రోల్స్ లో మెప్పించింది. ఇక 2015లో ఎవడే సుబ్రమణ్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత కల్యాణ వైభోగం, విజేత, మహానటి, ట్యాక్సీవాలా, ఒరేయ్ బుజ్జిగా, థ్యాంక్యూ, డెవిల్, కల్కి వంటి హిట్ సినిమాలో హీరోయిన్ గా చేసిందీ ముద్దుగుమ్మ.

బైకర్ సినిమా ప్రమోషన్లలో మాళవికా నాయర్..

 

View this post on Instagram

 

A post shared by UV Creations (@uvcreationsofficial)

లేటెస్ట్ గా శర్వానంద్ నటించిన బైకర్ సినిమాతో మరో హిట్ అందుకుంది మాళవికా నాయర్. ఇందులో ఆమె పోషించిన అనసూయ పాత్రకు మంచి పేరొచ్చింది. దీంతో మరోసారి ఈ బ్యూటీ పేరు మార్మోగిపోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Malvika Nair (@malvikanairofficial)

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.