కావాల్సిన పదార్దాలు: అరకిలో చికెన్ , 10 వెల్లుల్లి రెబ్బలు, రెండు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్స్ కారం ,
అర టేబుల్ స్పూన్ పసుపు , రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా,
కరివేపాకు, కొత్తిమీర ఆకులు, మూడు టేబుల్ స్పూన్లు నూనెను తీసుకోవాలి.
ముందుగా చికెన్ తీసుకుని ఒకటికి రెండు సార్లు బాగా వాటికి ఉప్పు, పసుపు పట్టించి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఇక ఇప్పుడు వేరే పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి, అది వేడయ్యాక కరివేపాకులు, పచ్చిమిర్చిని బాగా వేయించండి.
ఇప్పుడు ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు తీసుకుని అవి బంగారు కలర్లోకి వచ్చే వరకు వాటిని వేయించాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి. ఇప్పుడు నూరిన వెల్లుల్లిని కొద్దిగా వేసి బాగా వేయించుకోవాలి.
ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు వేసి మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు దానిలో చికెన్ వేసి హై మంట పై పెట్టి 10 నిమిషాలు కలుపుతూ బాగా వేపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మీడియం మంటపై చికెన్ బాగా ఉడికే వరకు పొయ్యి మీదే ఉంచుకోవాలి.
చివర్లో మసాలా పొడి వేసి, నూనె పైకి తేలే వరకు పొయ్యి మీదే ఉంచండి. ఇంకా అర కట్ట కొత్తిమీరను తీసుకుని వేసి స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయాలి. అంతే, వేడి వేడి చికెన్ వెల్లుల్లి కారం రెడీ.




