Reading Time: 2 minutes

దక్షణ కొరియా స్మార్ట్ ఫోన్ సంస్థ శాంసంగ్ భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల ధరలను మరోసారి పెంచింది. అయితే, ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎంట్రీ-లెవల్ నుండి మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్లపై ధరలు పెంచిన కంపెనీ తాజాగా ఎంపిక చేసిన ఫోన్ల ధరలను సవరించింది. ఇందులో గెలాక్సీ A, F సిరీస్ మూడేళ్లు ఉన్నాయి. ఈ మేరకు టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సదరు ధరల పట్టికను ఎక్స్ లో షేర్ చేశారు. కాగా, నేటి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పుడు ఏ మోడల్ పై ఎంత పెరిగిందో తెలుసుకుందాం. 

శాంసంగ్ గెలాక్సీ A07

గెలాక్సీ A07 విషయానికి వస్తే..దీని 4GB + 64GB వేరియంట్ ధర గతంలో ఉన్న రూ.9,749 నుండి ఇప్పుడు రూ.10,999కి పెరిగింది. అంటే, ఇది సుమారుగా రూ.1,250 పెరుగుదలను సూచిస్తుంది. 

శాంసంగ్ గెలాక్సీ A06 5G

గెలాక్సీ A06 5Gలోని వివిధ వేరియంట్లలో రూ.1,000 వరకు పెరిగింది. దీని 4GB + 64GB మోడల్ ధర ఇప్పుడు రూ.13,499. కాగా, 4GB + 128GB వేరియంట్ ధర రూ.15,499. అలాగే, 6GB + 128GB వేరియంట్ ధర రూ.17,499గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ A07 5G 

గెలాక్సీ A07 5G వేరియంట్ల ధరలు కూడా మారాయి. 4GB + 128GB మోడల్ ధర ఇప్పుడు రూ.16,499. కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ.18,499గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ A17 5G

అదేవిధంగా గెలాక్సీ A17 5G వేరియంట్ల ధరలు కూడా రూ.1,000- రూ.1,500 వరకు పెరిగాయి. 6GB + 128GB మోడల్ ధర రూ.21,499, 8GB + 128GB వేరియంట్ ధర రూ.23,499, 8GB + 256GB మోడల్ ధర రూ.27,999గా ఉంది. 

శాంసంగ్ గెలాక్సీ A36

మిడ్-రేంజ్ విభాగంలో గెలాక్సీ A36 ధర కూడా పెరిగింది. దీని ధరలు రూ.1,500 – రూ.3,000 వరకు పెరిగాయి. 8GB + 128GB వేరియంట్ ధర ఇప్పుడు రూ.33,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.37,999, 12GB + 256GB మోడల్ ధర రూ.43,499గా ఉంది. 

శాంసంగ్  గెలాక్సీ A56

గెలాక్సీ A56 ధర రూ.2,000 -రూ.3,500 వరకు పెరిగింది. దీని 8GB + 128GB వేరియంట్ ధర రూ.42,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.46,999, 12GB + 256GB వేరియంట్ ధర రూ.52,499గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ F17 5G

గెలాక్సీ F17 5G స్మార్ట్ ఫోన్ అన్ని వేరియంట్ల ధరలు రూ.1,000 పెరిగింది. దీని 4GB + 128GB వేరియంట్ ధర రూ.17,999, 6GB + 128GB వేరియంట్ ధర రూ.19,999,, 8GB + 128GB వేరియంట్ ధర రూ.21,999గా ఉంది.