
ఐపీఎల్ చరిత్రలో స్పిన్ బౌలింగ్‌తో మ్యాచ్‌లను మలుపుతిప్పిన బౌలర్‌లలో మిస్టరీ సిన్నర్, వెస్టిండీస్ దిగ్గజం సునీల్ నరైన్ పేరు ముందు వరసలో ఉంటుంది. అతని మిస్టరీ స్పిన్ ముందు ఎందరో బ్యాటర్‌లు తలొంచారు. అల్లాటప్పా బ్యాటర్‌లు మాత్రమే కాదు.. టాప్ దిగ్గజాలు కూడా తడబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా టాప్ ఇండియన్, గ్లోబల్ స్టార్ బ్యాటర్లపై నరైన్ ఆధిపత్యం చూపాడు. అతడి గణాంకాలు చూస్తే నరైన్ ఎంత ప్రమాదకరమైన బౌలర్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది.
సునీల్ నరైన్ బౌలింగ్‌లో అవుట్ అయిన బ్యాటర్‌ల ఆసక్తికరంగా ఉంటుంది. కింగ్ విరాట్ కోహ్లీని నరైన్ ఐదుసార్లు అవుట్ చేశాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను ఏకంగా ఎనిమిది సార్లు ఔట్ చేసి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. తన సహచరుడు, పవర్ హిట్టింగ్‌కు పేరుగాంచిన క్రిస్ గేల్‌ను నాలుగు సార్లు అవుట్ చేసిన నరైన్.. టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనీని మూడు సార్లు, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ను నాలుగు సార్లు పెవిలియన్‌కు పంపించాడు.
సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఈ ఐదుగురు దిగ్గజ బ్యాటర్ల స్ట్రైక్ రేట్ 100కు పైగా లేకపోవడం విశేషం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, క్రిస్ గేల్, ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్ కేవలం అవుట్ అవ్వడం మాత్రమే కాదు.. రన్స్ చేయడంలో కూడా తీవ్రంగా కష్టపడ్డారు. ఈ గణాంకాలు చూస్తే నరైన్‌ను ఐపీఎల్ ‘గోట్’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మిస్టరీ స్పిన్, కంట్రోల్, మ్యాచ్‌ను మార్చే సామర్థ్యం.. అన్ని కలిపి అతడిని లెజెండ్ స్థాయికి తీసుకెళ్లాయి. నరైన్‌కు ఇప్పటివరకు సాటే లేరని అభిమానులు అంటున్నారు.ప్రస్తుతం ఐపీఎల్ 2026 నడుస్తుండగా.. గురువారం (ఏప్రిల్ 9) లక్నో మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన కోటా 4 ఓవర్లలో 13 రన్స్ మాత్రమే ఇచ్చి.. ఓకే వికెట్ తీశాడు.