
మథురు: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మథురలో యమున నదిలో పడప బోల్తా పడి 9 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. పడవ బోల్తా పడటంతో పదుల సంఖ్యలో వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయక చ్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ తొమ్మిది మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. సీ ఘాట్ వద్ద ఉన్న పాంటూన్ వంతెనను ఢీకొట్టడంతో ఈ పడవ బోల్తా పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.