Reading Time: < 1 minute
Athidi Re Release Mahesh Babu Film Returns In 4k With Re Edit On May 29

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా పాత సినిమాలు మళ్లీ విడుదల కావడం ఒక ఆనవాయితీగా మారింది. అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌లతో పాటు నిరాశపరిచిన చిత్రాలు కూడా రీ-రిలీజ్‌లో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఫ్లాప్ మూవీ ‘ఆరెంజ్’ సినిమా రీ-రిలీజ్‌లో మంచి విజయాన్ని అందుకుంది. అదే బాటలో ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2007లో విడుదలైన ‘అతిథి’ని కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సూపర్‌స్టార్ కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని మే 29న అతిథి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు అభిమానులకు ఇది ఓ శుభవార్త అనే చెప్పాలి. 4K క్వాలిటీతో పాటు నేటి థియేటర్ల టెక్నాలజీకి అనుగుణంగా ఆడియోను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. అతిథి ఫలితం అప్పట్లో ఆశించిన స్థాయిలో లేకపోయినా.. ఈ చిత్రంలో కొన్ని అంశాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్షన్, లుక్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. మణిశర్మ అందించిన అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. హీరోయిన్ అమృతా రావు నటన, గ్లామర్ అభిమానులను కట్టిపడేస్తాయి.

Also Read: RR vs RCB: ఆర్ఆర్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్.. భువీ-వైభవ్ పోరు కోసం ఆసక్తిగా ఫాన్స్!

సాధారణంగా సినిమాలను 4Kకి కన్వర్ట్ చేసి విడుదల చేస్తారు. కానీ అతిథి విషయంలో మేకర్స్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాను మళ్లీ రీ-ఎడిట్ చేస్తున్నారు. కథనంలో వేగం పెంచి, ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండేలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రీ-ఎడిటింగ్ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుంది?, అభిమానులను ఎలా మెప్పిస్తుంది? అనేది తెలియాలంటే మే 29 వరకు వేచి చూడాల్సిందే.