Reading Time: 2 minutes

LIK Movie Review : ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ టాక్ ఎలా ఉంది? ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా!

Caption of Image.

కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా.. టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). భారీ అంచనాల మధ్య ఈ రోజు (  ఏప్రిల్ 10న ) ఈ  మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఘనంగా రిలీజ్ అయింది. 2040వ సంవత్సరం నాటి ‘ఫ్యూచరిస్టిక్’ ప్రేమకథగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందా?.. ప్రదీప్ మరో సారి హీట్ కొట్టేశాడా? చూద్దాం..

కథా నేపథ్యం..

కథ మొత్తం 2040వ సంవత్సరంలో జరుగుతుంది. అప్పటి ప్రపంచం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) అనే ఒక యాప్ చుట్టూ తిరుగుతుంటుంది. మనుషులు ఎవరిని ప్రేమించాలి? ఎప్పుడు బ్రేకప్ చెప్పుకోవాలి? అనేది కూడా ఆ యాప్ ఇచ్చే ‘లవ్ స్కోర్’ మీద ఆధారపడి ఉంటుంది. ఈ యాప్‌ను సృష్టించి టెక్నాలజీతో యువత భావోద్వేగాలను శాసించే సీఈఓగా సూర్య (ఎస్.జె. సూర్య) కనిపిస్తారు. 

మరోవైపు కథానాయకుడు వాసు (ప్రదీప్ రంగనాథన్) ప్రకృతిని ప్రేమిస్తూ, టెక్నాలజీకి దూరంగా ‘ఆర్గానిక్ వరల్డ్’లో బతికే యువకుడు. అతను ధీమా (కృతి శెట్టి) అనే ఇన్ఫ్లుయెన్సర్ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే, ధీమా తన మనసు కంటే యాప్ ఇచ్చే రేటింగ్స్‌నే గుడ్డిగా నమ్ముతుంది. యాప్ కారణంగా వీరి ప్రేమకు ఎదురైన అడ్డంకులు ఏమిటి? టెక్నాలజీ కంటే మనిషి మనసు గొప్పదని వాసు ఎలా నిరూపించాడు? అనేదే ఈ చిత్ర ఇతివృత్తం.

సినిమా ఎలా ఉందంటే?

ఈ సినిమా ఒక కొత్త కాన్సెప్ట్ లో తెరకెక్కించారు దర్శకుడు విఘ్నేష్ శివన్. భవిష్యత్తులో టెక్నాలజీ మన జీవితాలను ఎలా కంట్రోల్ చేస్తుందనే పాయింట్ చాలా కొత్తగా ఉంది. విఘ్నేష్ శివన్ ఎంచుకున్న ఈ థీమ్ నేటి యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. ప్రదీప్ రంగనాథన్ తనదైన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు.. ఇక ఎస్.జె. సూర్య మరోసారి తన విలక్షణ నటనతో అదరగొట్టారు. ఆయన మేనరిజమ్స్ థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. 

►ALSO READ | కుంభమేళా మోనాలిసా పెళ్లిలో ట్విస్ట్.. భర్త ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు.. ఏం జరిగిందంటే?

అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్రధాన బలం నిలిచింది.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ 2040 నాటి ప్రపంచాన్ని చాలా రిచ్‌గా చూపించింది. అయితే కథనం చాలా బలహీనంగా ఉందన్న మిశ్రమ టాక్ వినిపిస్తోంది. కాన్సెప్ట్ బాగున్నా, దాన్ని తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు కొంత తడబడ్డారు. ఫస్టాఫ్ సరదాగా సాగినా, సెకండ్ హాఫ్ సాగదీతగా అనిపిస్తుందన్న అభిప్రాయం ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

ఎమోషనల్ కనెక్ట్

ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్ మీద పెట్టిన శ్రద్ధ ప్రేమలోని భావోద్వేగాల మీద పెట్టలేదనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అంతగా పండలేదు. కృతి శెట్టికి నటనకు పెద్దగా స్కోప్ లేని పాత్ర దక్కింది. 2040 నాటి ప్రపంచం కొన్ని చోట్ల సహజంగా అనిపించదు. యోగి బాబు వంటి స్టార్ కమెడియన్లను సరిగ్గా వాడుకోలేదు. క్లైమాక్స్ కూడా చాలా సాదాసీదాగా ఉండటం నిరాశ పరిచిందన్న టాక్ సినీ ప్రియుల నుంచి వినిపిస్తోంది.

మొత్తంగా చెప్పాలంటే, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఒక విభిన్నమైన ప్రయత్నం. టెక్నాలజీ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీని కోరుకునే యువతకు, ప్రదీప్ రంగనాథన్ అభిమానులకు ఈ సినిమా నచ్చుతుంది. కానీ, లోతైన భావోద్వేగాలను ఆశించే వారికి మాత్రం ఇది కొంత అసంతృప్తిని మిగిల్చవచ్చు. రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా ఒక కొత్త ప్రపంచాన్ని చూడాలనుకుంటే ఈ వీకెండ్ ‘LIK’ని ఒకసారి ట్రై చేయవచ్చు..
 

 

©️ VIL Media Pvt Ltd.