Reading Time: < 1 minute

తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డూ ప్రసాదం సేల్స్… ఒక్క ఏడాదిలోనే 14 కోట్ల లడ్డూలు..!

Caption of Image.

దేవదేవుడు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తిరుమల లడ్డు ప్రసాదానికి ఉన్న రుచి, పవిత్రత ప్రపంచంలో ఏ ప్రసాదానికి ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతటి పవిత్రత ఉన్న లడ్డూ ప్రసాదం సేల్స్ ప్రతి ఏటా రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదం సేల్స్ రికార్డు స్థాయిలో నమోదైనట్లై తెలిపింది టీటీడీ. 

2025-26 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ లడ్డూ విక్రయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిందని తెలిపారు అధికారులు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో లడ్డూలు అమ్ముడయ్యాయని తెలిపారు.

►ALSO READ | తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పాత నోట్లు..టిటిడి ఖజానాలో రూ.400 కోట్ల పాత నోట్లు…

ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13.95 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు తెలిపారు టీటీడీ అధికారులు. ఇక, లడ్డూల విక్రయం ద్వారా సుమారు రూ.567 కోట్లు ఆదాయం వచ్చిందని.. రోజువారీగా సగటున 4 లక్షల లడ్డూలను తయారు చేసి, అదే స్థాయిలో విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇది తిరుమలలో భక్తుల రద్దీ ఎంతగా ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది.

©️ VIL Media Pvt Ltd.