
గౌహతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గౌహతిలోని బర్సాపరా స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా టాస్ వేయడం వాయిదా పడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ జట్టు 6 పాయింట్లతో, +2.403 నెట్ రన్‌రేటుతో మొదటి స్థానంలో ఉంది. మరోవైపు బెంగళూరు 4 పాయింట్లతో, +2.501 నెట్ రన్‌రేటుతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్2లో గెలిచిన జట్టు మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్ సజావుగా జరుగుతుందో.. లేక వర్షం కారణంగా రద్దవుతుందో తెలియాలంటే.. ఇంకాసేపు వేచి చూడాల్సిందే.