
Virat Kohli: ఐపీఎల్ లో ఈరోజు రాత్రి జరగనున్న మ్యాచ్‌లో రాజస్థాన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఓడిపోలేదు.. దీంతో ఈ పోరు రసవత్తరంగా కొనసాగనుంది. కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించి రాజస్థాన్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది. కాగా గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు RCB శిబిరంలో సందడి నెలకొంది. ముఖ్యంగా RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో ఫన్నీ సెటైర్స్ వేస్తూ సహచర ఆటగాళ్లతో సరదాగా గడుపుతున్నాడు. ఈ సందర్భంగా వెస్టిండీస్ పవర్ హిట్టర్ రొమారియో షెపర్డ్‌ను కోహ్లీ ఆటపట్టించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇది చాలదు బాస్:
ప్రాక్టీస్ సమయంలో షెపర్డ్ ఒక భారీ సిక్సర్ కొట్టగా, ఆ బంతి వెళ్లి నేరుగా డ్రెస్సింగ్ రూమ్ విండోకి వెళ్లి తాకింది. పక్కనే ఉండి ఇదంతా గమనిస్తున్న విరాట్ కోహ్లీ, వెంటనే కరీబియన్ యాసను (Caribbean accent) అనుకరిస్తూ షెపర్డ్‌పై జోకులు వేశాడు. ఇది సరిపోదు బాస్.. బంతిని గౌహతి అవతలికి పంపించు అంటూ కింగ్ కోహ్లీ సరదాగా అనడంతో అక్కడ ఉన్న వాళ్లు ఒక్కసారిగా నవ్వులు చిందించారు.
►ALSO READ | CSK Crisis: చెన్నై సూపర్ కింగ్స్ సరైనా ప్లేయర్స్ని తీసుకోలే.. CSKపై మాజీ క్రికెటర్ ఫైర్
ఛాంపియన్ హోదాలో ఆర్‌సీబీ:
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన బెంగళూరు, ఈ సీజన్‌ను అదిరిపోయే విజయాలతో టోర్నమెంట్ ని ప్రారంభించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించగా, సీఎస్కేపై జరిగిన మ్యాచ్‌లోనూ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ జట్టు ఇప్పుడు అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందంటే.. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో రొమారియో షెపర్డ్ బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే రాలేదు. ఈరోజు రాత్రి జరగనున్న మ్యాచ్‌లో రాజస్థాన్, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు ఇప్పటివరకు ఓటమి ఎరుగని నేపథ్యంలో, ఈ పోరు రసవత్తరంగా సాగనుంది. కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించి రాజస్థాన్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది.
Kohli speaking in a West Indies accent to Romario when he hits a six 😂❤️pic.twitter.com/appVdlKr5F
— Suprvirat (@Mostlykohli) April 10, 2026