Reading Time: < 1 minute

ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరైన సీఎం రేవంత్ 

Caption of Image.

ఢిల్లీలోని ఇందిరా భవన్ లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం ( ఏప్రిల్ 10 ) మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ కీలక నేతలు హాజరయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

మహిళా రిజెర్వేషన్ల అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చినట్లు సమాచారం. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్న క్రమంలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. 

►ALSO READ | ఎనిమిదేళ్ల తర్వాత ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశంపై పార్లమెంటులో చర్చించి చట్టసవరణ చేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తోంది కేంద్రం.పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలు, పార్టీ లైన్ పై సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. 

©️ VIL Media Pvt Ltd.