
సీజ్ ఫైర్ క్షణ క్షణం ఉల్లంఘన జరుగుతుంది. అమెరికా చెప్పినా ఇజ్రాయెల్ వినటం లేదు. కాల్పుల విరమణ లేదు తొక్కా లేదు అంటూ లెబనాన్ దేశంపై కంటిన్యూగా విరుచుకుపడుతుంది ఇజ్రాయెల్. లెబనాన్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. సీజ్ ఫైర్ వర్తించదు అంటూ లేటెస్ట్ గా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. అంతేకాదు హిజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని.. హిజ్బుల్లా ఆక్రమిత లెబనాన్ ను నేల మట్టం చేసి తీరతామని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేశారు నెతన్యాహు.
కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత నుంచి హిజ్బుల్లా టార్గెట్ గా లెబనాన్ పై మరింత విరుచుకుపడుతుంది ఇజ్రాయెల్. విధ్వంసం చేస్తోంది. కంటిన్యూగా డ్రోన్ బాంబులు, మిస్సైల్స్ ప్రయోగిస్తూనే ఉంది.
ఇజ్రాయెల్ అరాచకాన్ని ఆపాలని.. అప్పటి వరకు మేం కూడా వెనక్కి తగ్గం అని స్పష్టం చేసింది ఇరాన్. ఒప్పందంలో లెబనాన్ ఉందని.. లెబనాన్ పై దాడులు ఆపితేనే చర్చలకు వస్తాం అంటోంది ఇరాన్ దేశం.
►ALSO READ | అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌లో అల్లకల్లోలం.. లక్షకు పైగా భవనాలు నేలమట్టం!
లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకు హర్మూజ్ జల సంధిని తెరిచేది లేదని.. అప్పటి వరకు నిర్బంధం కొనసాగుతుందని స్పష్టం చేసింది ఇరాన్. ఇదే సమయంలో గల్ఫ్ దేశాల్లోనూ పేలుళ్లు జరుగుతున్నాయి. ఇరాన్ పనే అని గల్ఫ్ దేశాలు అంటుంటే.. మేం కాదని చెబుతుంది ఇరాన్.
మరో వైపు పాకిస్తాన్ కేంద్రంగా దౌత్య చర్చలకు అంతా సిద్ధం అయ్యింది. అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి ఒప్పందంపై చర్చించనున్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటన చేయటంతో ఇరాన్ వైఖరి ఏంటీ అనేది ఆసక్తిగా మారింది.