Reading Time: 2 minutes
Director : స్టార్ డైరెక్టర్ ఇంటి పై కాల్పులు.. పోలీసుల అలర్ట్.. భారీగా భద్రత..

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. అర్దరాత్రి రోహిత్ ఇంటిపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపినట్లు సమాచారం. అర్దరాత్రి సమయంలో ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న రోహిత్ ఇంటిపై దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే డైరెక్టర్ ఇంటికి భారీగా భద్రతను మోహరించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే ఈ విషయంపై అటు రోహిత్ శెట్టి.. ఇటు పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. నిందితులను గుర్తించడానికి సాధ్యమైన ప్రతి కోణాన్ని అన్వేషిస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..

దాడి వెనుక ఎవరున్నారో అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. రోహిత్ శెట్టి ముంబైలోని జుహు ప్రాంతంలో నివసిస్తున్నారు. జుహూ ప్రాంతంలో బాలీవుడ్ స్టార్ సెలబ్రేటీస్ నివసిస్తున్నారు. కాల్పులు ఘటన అనంతరం సమాచారం తెలుసుకున్న రోహిత్ శెట్టి అర్దరాత్రి తన ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. నిందితులను గుర్తించడానికి ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎటువంటి గాయాలు లేదా ప్రాణనష్టం సంభవించలేదని వర్గాలు తెలిపాయి. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

రోహిత్ శెట్టి నివాసం వెలుపల నుండి ఒక వీడియో వైరల్ అవుతోంది, ముంబై పోలీసులు చిత్రనిర్మాత జుహు ఇంటిని చుట్టుముట్టినట్లు చూపిస్తుంది, సమీపంలో నాలుగు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని సమాచారం. ఆ ప్రాంతం ఇప్పుడు నిఘాలో ఉంది.రోహిత్ శెట్టి ఇటీవలే “సింఘం ఎగైన్” చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించారు. 2024లో విడుదలైన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, కరీనా కపూర్ ఖాన్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, అర్జున్ కపూర్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కీలకపాత్రలు పోషించారు. సుమారు రూ.350 కోట్లతో నిర్మించిన ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..