Reading Time: < 1 minute
Us Iran War Middle East Power Shift Us Military Impact

US-Iran War: అమెరికా ప్రపంచంలోనే గొప్ప మిలిటరీ శక్తి. అయితే, ఇరాన్ యుద్ధం తర్వాత యూఎస్ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇరాన్ యూఏఈని అడ్డుకున్న తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయిల్, అమెరికా కలిసి దాడులు ప్రారంభించిన వారంలోపే ఇరాన్‌లో తమ పాలన వస్తుందని భావించాయి, కానీ ఇరాన్ సైన్యం అమెరికాను తీవ్రంగా దెబ్బతింది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ యుద్ధం నుంచి ఎలా ఎగ్జిట్ కావాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. చివరకు కాల్పుల విరమణ ప్రకటించి.. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ సహకారంతో శాంతి చర్చలకు సిద్ధమయ్యారు.

Read Also: Pakistan-Israel: చర్చలకు ముందు పాకిస్తాన్‌లో ఇజ్రాయిల్ భయాలు..

ఇదిలా ఉంటే, ఈ యుద్ధం మధ్యప్రాచ్యంలో పవర్ బ్యాలెన్స్‌ను పూర్తిగా మార్చేసింది. ఇరాన్‌ను ఒక గొప్ప శక్తిగా మార్చింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ లోని కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఖతార్ దేశాలపై విరుచుకుపడింది. ముఖ్యంగా, ఏన్నో ఏళ్లుగా అమెరికా నిర్మించుకుంటూ వచ్చిన సామ్రాజ్యాన్ని కూల్చేసింది. ఈ దేశాల్లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలను ఇరాన్ సర్వనాశనం చేసింది. ఈ ప్రాంతంలోని సుమారు 12 స్థావరాలు ఇరాన్ దాడులకు గురయ్యాయి. ఇప్పుడు ఈ స్థావరాలను ఉపయోగించే స్థితిలో లేవని న్యూయార్క్ టైమ్స్ గతంలో నివేదించింది. అయితే, ఈ నష్టాల గురించి ట్రంప్ ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా వ్యవస్థల్ని ఇరాన్ ఒక నెలలో నాశనం చేసిందని అన్నారు. ఒకప్పుడు అమెరికన్ నేవీకి కేంద్రంగా పరిగణించిన బహ్రైయిన్‌లోని యూఎస్ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని ఇరాన్ టార్గెట్ చేసి దాడి చేసింది. ఈ యుద్ధం తర్వాత, గల్ఫ్‌లో అమెరికా పట్టు బలహీనపడింది. 1990 గల్ఫ్ యుద్ధం తర్వాత అమెరికా ఆ ప్రాంతంలో విసత్రించింది. దాదాపుగా 19 పెద్ద సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. వీటిలో 50,000 మంది సైనికుల్ని ఉంచింది. ఈ బలగాలు గల్ఫ్ దేశాల రక్షణ కోసం ఉద్దేశించబడినవి. అయితే, ఇప్పుడు ఇరాన్ వార్ తర్వాత ఇది చాలా బలహీనమైంది.