
Bajaj Pulsar 180 Relaunched: భారతీయ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది బజాజ్ (Bajaj) కంపెనీ. కంపెనీ ఫేమస్ బైక్ లలో ఒకటైన పల్సర్ సంబంధించి Pulsar 180ను మళ్లీ రీలాంచ్ చేసింది. ఒకప్పుడు యువతలో మంచి క్రేజ్ సంపాదించిన ఈ బైక్, ఇప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌తో తిరిగి ఎంట్రీ ఇస్తోంది. ఈ బైక్ కేవలం ఒక్క వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. పల్సర్ 150 & పల్సర్ 220F మధ్యలో ఈ బైక్ ప్లేస్ కానుంది.
2001లో పల్సర్ 150తో పాటు తొలిసారి మార్కెట్లోకి వచ్చిన పల్సర్ 180, గత రెండు దశాబ్దాల్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో 2022లో నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులతో బజాజ్ ఈ బైక్‌ను తిరిగి తీసుకొచ్చింది. అయితే ఈసారి కొన్ని కొత్త డిజైన్ అప్‌డేట్స్ ఇచ్చారు. సింగిల్ పీస్ సీట్, LED హెడ్‌లైట్, LED ఇండికేటర్లు, అలాగే స్పోర్టీ బ్లాక్ కలర్ స్కీమ్‌తో కొత్త గ్రాఫిక్స్ అందించారు. ఈ మార్పులు బైక్‌కు మరింత ఆకర్షణీయమైన లుక్ ఇస్తున్నాయి.
కొత్త Pulsar 180లో LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. దీని ద్వారా కాల్స్, SMS అలర్ట్స్ అందుతాయి. అయితే టర్న్-బై-టర్న్ నావిగేషన్ సపోర్ట్ మాత్రం అందించలేదు. ఇక ఇంజిన్ విషయానికి వస్తే ఈ బైక్‌లో 178.61cc ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 8,500rpm వద్ద 17bhp పవర్, 6,500rpm వద్ద 15Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. బైక్ కు 165mm గ్రౌండ్ క్లియరెన్స్, 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, 156kg బరువు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్‌తో పాటు సింగిల్ ఛానల్ ABS అందించారు. ఈ బైక్ 17 అంగుళాల అలాయ్ వీల్స్‌తో పాటు ట్యూబ్ లెస్ టైర్స్ పై నడుస్తుంది.
Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!
ఈ బైక్ బ్లాక్ గోల్డ్, బ్లాక్ బ్లూ, బ్లాక్ గ్రెయ్, బ్లాక్ రెడ్, వైట్ (తెలుపు) అనే ఐదు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. అలాగే పాత మోడల్‌లో ఉన్న మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్లిమ్ టెయిల్ డిజైన్ అలాగే కొనసాగించారు. దీని ధర రూ.1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
.@_bajaj_auto_ltd brings back the Pulsar 180.
Now with new graphics, LED lighting and a Bluetooth-enabled console. Priced at ₹1.22 lakh ex-showroom#Pulsar180 #Bajaj pic.twitter.com/pItW9LGQFu
— Motoring World (@MyMotoringWorld) April 10, 2026