
ట్రాన్స్ జెండర్లకు మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి మున్సిపాలిటీ నుంచి కోఆప్టెడ్ మెంబర్ గా ట్రాన్స్ జెండర్లను ఎన్నుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా భవన్ లో బాల భరోసా, ప్రణామ్ డేకేర్ సెంటర్ పథకాలు ప్రారంభించిన సీఎం.. ప్రజా ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందన్నారు. దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు
ALSO READ : ఇసుక అక్రమ దందా చేస్తే ఉపేక్షించేది లేదు..మంత్రి వివేక్ హెచ్చరిక
సీఎం రేవంత్ కామెంట్స్:
- ప్రజాభవన్ లో బాల భరోసా, ప్రణామ్ డే కేర్ సెంటర్ ప్రారంభం
- ప్రజా ప్రభుత్వం దివ్యాంగుల కోసం పనిచేస్తుంది
- ప్రభుత్వం అందించే పథకాలను ఉపయోగించుకోవాలి
- దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ
- దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తాం.. అన్ని రకాలుగా ఉంటాం
- రూ.50 కోట్లతో దివ్యాంగులకు పరికరాలు
- దివ్యాంగులకు జైపాల్ రెడ్డి స్ఫూర్తి
- వైకల్యం ఉందనే ఆలోచనను కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి
- కార్పోరేట్ ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ల నామినేట్ చేస్తాం
- కోఆప్టెడ్ మెంబర్లుగా ఎన్నకోవాల్సిన అవకాశం ఉంది
- ప్రతి మున్సిపాలిటీలో వాళ్లను ఎన్నుకోవాలి
- వచ్చే కేబినెట్ సమావేశంలో నిర్ణయం
- ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోంది.
- ప్రణామ్ పేరుమీద వృద్ధ తల్లిదండ్రులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం