Reading Time: < 1 minute
Ap Deputy Cm Pawan Kalyan Launches Rs 20 77 Crore Shankaraguptha Drain Project For Konaseema Farmers

Deputy CM Pawan Kalyan: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు ఉప ముఖ్యమంత్రి.. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు.. మరోవైపు, శంకర గుప్తంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.. కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ. 20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు.. రాజోలు పర్యటనలో 45 రోజుల్లో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ హామీ ఇచ్చిన విషయం విదితమే.. అయితే, 35 రోజుల్లోపే సమస్యకు పరిష్కారం చూపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌..

Read Also: MSVG : గుంటూరులో మెగా సంబరాలు.. వెంకీ మామ, చిరు ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..!